Dailyhunt
వర్జీనియా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ ఘాతుకం.. భార్యను చంపి తాను ఆత్మహత్య!

వర్జీనియా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ ఘాతుకం.. భార్యను చంపి తాను ఆత్మహత్య!

వార్త 5 days ago

Justin Fairfax: అమెరికా రాజకీయాల్లో ఒకప్పుడు వెలుగు వెలిగిన నేత, వర్జీనియా మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ జస్టిన్ ఫెయిర్‌ఫ్యాక్స్ దారుణానికి ఒడిగట్టారు.

తన భార్యను కాల్చి చంపి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటన వర్జీనియా రాష్ట్రంతో పాటు అమెరికా రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Read Also: Iran-America War: ఇరాన్ నౌకాదళం ఖాళీ.. రెండు నెలల్లోనే విజయం ఖాయం: ట్రంప్

Justin Fairfax: అసలేం జరిగింది?

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. గురువారం ఉదయం అన్నేన్‌డేల్‌లోని వారి నివాసంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో జస్టిన్ తన భార్యను బేస్‌మెంట్‌లో తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం పై అంతస్తులోకి వెళ్లి తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో వారి, కుమారుడు, కుమార్తె ఇంట్లోనే ఉన్నారు. వీరి కుమారుడే పోలీసులకు (911) ఫోన్ చేసి సమాచారం అందించాడు.పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఆపై దర్యాప్తు చేపట్టారు.

 Virginia Ex-Lt Governor Death

2017లో లెఫ్టినెంట్ గవర్నర్‌గా విజయం సాధించిన జస్టిన్.. వర్జీనియా రాజకీయాల్లో రైజింగ్ స్టార్గా పేరు తెచ్చుకున్నారు. ఒకానొక దశలో వర్జీనియాకు రెండో నల్లజాతీయుడైన గవర్నర్ అయ్యే అవకాశం కూడా ఆయనకు వచ్చింది. అయితే 2019లో ఇద్దరు మహిళలు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఆయన కెరీర్ ఒక్కసారిగా తలకిందులైంది. ఆ ఆరోపణల నుంచి ఆయన బయట పడలేకపోయారు. అప్పటి నుంచి ఆయనకు ఉపాధి కరువైందని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారని సన్నిహితులు చెబుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha