Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరుస సెలవులు రావడంతో యాదాద్రికి పోటెత్తిన భక్తులు

వరుస సెలవులు రావడంతో యాదాద్రికి పోటెత్తిన భక్తులు

వార్త 3 months ago

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. వేసవి సెలవులతో పాటు వరుసగా సెలవు రోజులు రావడంతో ఆలయ పరిసరాలన్నీ జనసందోహంగా మారాయి.

స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు కొండపైకి చేరుకుంటున్నారు. ఆలయ మాడ వీధులు భక్తుల రాకతో నిండిపోయాయి.

Read also: Modi Visit to Hyderabad: హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

 Devotees crowd Yadadri Temple premises

Yadadri Temple: క్యూలైన్లలో భక్తుల ఎదురుచూపులు

రద్దీ పెరగడంతో ధర్మదర్శనం క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. ప్రసాద విక్రయశాలలు, కల్యాణకట్ట, పుష్కరిణి ప్రాంతాల్లో ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

వాహనాలతో నిండిన ఘాట్ రోడ్లు

యాదాద్రి కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో వాహనాలు బారులు తీరాయి. పార్కింగ్ స్థలాలు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తున్నారు. వ్రత మండపాలు, విశ్రాంతి గదులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కొండగట్టులో మొదలైన హనుమాన్ జయంతి సంబరాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha