Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడంటే?

వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడంటే?

వార్త 2 weeks ago

Bank Holidays: బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యమైన హెచ్చరిక. ఈ నెలలో (సెప్టెంబర్) బ్యాంక్ ఉద్యోగులు నాలుగు రోజుల పాటు సమ్మె చేపట్టనున్నారు. యునైటెడ్ ఫోరమ్స్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) కింద ఉన్న ఏడు ప్రధాన బ్యాంక్ ఉద్యోగ సంఘాలు ఉమ్మడిగా ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి.

ఈ ఆందోళన రెండు విడతలుగా జరగనుంది. తొలి విడతలో ఒక రోజు పాటు సమ్మె నిర్వహించనుండగా, రెండో విడతలో మూడు రోజుల పాటు నిరసన తెలపనున్నారు. దీనివల్ల బ్యాంక్ నేరుగా అందించే సేవలకు అంతరాయం కలిగే అవకాశముంది.

Read Also: Adarsha Kutumbam : వెంకటేష్ కు ఎన్టీఆర్ మాట సాయం !!

 Banks closed for 5 consecutive days-when?

Bank Holidays: రెండు విడతల్లో దేశవ్యాప్త సమ్మె

రెండో విడత సమ్మె కారణంగా నెల ఆఖరులో బ్యాంకింగ్ సేవలకు పెద్ద ఎత్తున విఘాతం కలగనుంది. సెప్టెంబర్ 26వ తేదీ నాలుగో శనివారం, సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం కావడంతో సాధారణ సెలవులు ఉంటాయి. ఆ తర్వాతి రోజైన సెప్టెంబర్ 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారు. ఫలితంగా సెప్టెంబర్ 26 నుండి 30 వరకు వరుసగా ఐదు రోజుల పాటు బ్రాంచ్ సంబంధిత సేవలన్నీ నిలిచిపోనున్నాయి.

ఉద్యోగ సంఘాల డిమాండ్లు

వారానికి ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయడం, పనితీరు ఆధారంగా ఇచ్చే ప్రోత్సాహకాలు (Incentives) అందించడం మరియు ఇతర సుదీర్ఘకాల పెండింగ్ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఒత్తిడి తెచ్చేందుకు ఈ సమ్మె చేపడుతున్నట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి.

బ్యాంక్ బ్రాంచ్‌లు మూతపడినప్పటికీ, ఖాతాదారులకు ఇబ్బంది కలగకుండా డిజిటల్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలతో పాటు యూపీఐ (UPI) లావాదేవీలు ఎప్పటిలాగే పనిచేస్తాయి. బ్రాంచ్‌లతో నేరుగా సంబంధమున్న నగదు డిపాజిట్లు, చెక్కుల క్లియరెన్స్ వంటి పనులు ఉన్నవారు ముందే ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం.

Epaper: epaper.vaartha.com

ఓటీటీలోకి 'విశ్వనాథ్ అండ్ సన్స్' ..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha