Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెలుగులోకి ఒమన్ కో-పైలట్ బ్యాక్ గ్రౌండ్ !

వెలుగులోకి ఒమన్ కో-పైలట్ బ్యాక్ గ్రౌండ్ !

వార్త 2 weeks ago

Flydubai Incident : ఇటీవల సంచలనం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన ఘటనకు సంబంధించి కీలక నిందితుడైన ఒమన్ దేశానికి చెందిన కో-పైలట్ నేపథ్యంపై అరబ్ మీడియా సంచలనాత్మక వివరాలను వెల్లడించింది.

ఆ నిందితుడి పేరు ‘హమామ్ అల్-హమ్మమీ’ అని గుర్తించినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఇతడు సుదీర్ఘకాలంగా తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడై, వివిధ తీవ్రవాద సంస్థలకు చెందిన వెబ్‌సైట్లను తరచూ సందర్శించేవాడని దర్యాప్తులో తేలింది. ఇతడి తల్లి సిరియా దేశానికి చెందిన మహిళ కాగా, ఆమె ద్వారా కూడా కొన్ని తీవ్రవాద కనెక్షన్లు ఉండే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతడి అను అనుమానాస్పద ప్రవర్తన, తీవ్రవాద మొగ్గు కారణంగానే 2024-2025 మధ్యకాలంలో ఒమన్ ఎయిర్‌లైన్స్ (Oman Air) యాజమాన్యం ఇతడిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు అరబ్ మీడియా స్పష్టం చేసింది.

భద్రతా లోపాలు మరియు ఫ్లైదుబాయ్ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు

ఒమన్ ఎయిర్‌లైన్స్ నుంచి తొలగించబడినప్పటికీ, ఫ్లైదుబాయ్ (Flydubai) సంస్థ సరైన బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ (నేపథ్య పరిశీలన) చేయకుండానే అతడికి వెంటనే కో-పైలట్‌గా ఉద్యోగం ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమానయాన రంగంలో అత్యంత కీలకమైన భద్రతా నిబంధనలను పక్కనబెట్టి, ఇలాంటి అనుమానాస్పద నేపథ్యం ఉన్న వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడంపై అంతర్జాతీయ విమానయాన వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక ఎయిర్‌లైన్ భద్రతాపరమైన కారణాలతో డిస్మిస్ చేసిన వ్యక్తిని మరొక ప్రసిద్ధ విమానయాన సంస్థ ఎలాంటి తనిఖీలు లేకుండా నియమించుకోవడం ఎంతటి ప్రమాదానికి దారితీసిందో ఈ ఘటన నిరూపించింది. ప్రస్తుతం ఈ విషయమై అంతర్జాతీయ స్థాయిలో భద్రతా సంస్థలు సమగ్ర విచారణ జరుపుతున్నాయి.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ వైఖరిని ప్రశంసించిన పుతిన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha