Dailyhunt
Venezuela: అమెరికా ఉగ్రదాడులను ఖండిస్తూ అనంతపురంలో కాగడాల ప్రదర్శన

Venezuela: అమెరికా ఉగ్రదాడులను ఖండిస్తూ అనంతపురంలో కాగడాల ప్రదర్శన

వార్త 3 months ago

ెనిజులా(Venezuela) దేశంపై అమెరికా సాగిస్తున్న ఉగ్రదాడులు, అక్రమ జోక్యం, అంతర్జాతీయ న్యాయస్థానాల నిబంధనలకు విరుద్ధంగా వెనిజులా దేశాధ్యక్షుడిని బంధించిన చర్యలను తీవ్రంగా ఖండిస్తూ సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఐద్వా, కెవిపిఎస్, ఆవాజ్, యుటిఎఫ్, ఐలు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని టవర్ క్లాక్ వద్ద నుంచి ప్రధాన వీధిలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి ఓబులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.

నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఒక స్వతంత్ర సార్వభౌమ దేశమైన వెనిజులా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, ప్రభుత్వ మార్పు లక్ష్యంగా అమెరికా చేపడుతున్న చర్యలు బహిరంగ సామ్రాజ్యవాద ఉగ్రవాదానికి నిదర్శనమన్నారు.

ఆర్థిక ఆంక్షలు, బెదిరింపులు, రాజకీయ కుట్రల ద్వారా వెనిజులా ప్రజల జీవన హక్కులపై నేరుగా దాడి చేస్తున్నదని విమర్శించారు.అంతర్జాతీయ న్యాయస్థానాల నిబంధనలు, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను కాలరాస్తూ వెనిజులా దేశాధ్యక్షుడిని బంధించడం ప్రపంచ శాంతికి తీవ్ర ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. ఇటువంటి సామ్రాజ్యవాద దాడులను ప్రపంచ దేశాలు, ప్రజాసంఘాలు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.వెనిజులా విషయంలో భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం దురదృష్టకరమన్నారు. ఒకప్పుడు సార్వభౌమత్వం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేయరాదు అనే విదేశాంగ విధానాన్ని అనుసరించిన భారతదేశం, నేడు అమెరికా సామ్రాజ్యవాద విధానాల పట్ల మౌనం పాటించడం సమంజసం కాదన్నారు.

భారత ప్రభుత్వం వెంటనే వెనిజులా(Venezuela) సార్వభౌమత్వానికి మద్దతుగా నిలిచి, అమెరికా దాడులను ఖండిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఐద్వా, కెవిపిఎస్, ఆవాజ్, యుటిఎఫ్, ఐలు సంఘాల జిల్లా నాయకులు, పరమేష్, అశ్వని, వలి, తిరుపాల్, రాంరెడ్డి, వెంకట్ నారాయణ, ఏటీఎం నాగరాజ్, తిరుమలేష్, భీమేష్, ప్రసాద్ రెడ్డి, సతీష్, వంశీ, శివారెడ్డి, వీరేంద్ర , కోటేశ్వరప్ప, గోవిందప్ప, నాగేంద్ర వీరితోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమెరికా సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Trump warns : అమెరికాను ఎదిరిస్తే భారీ మూల్యం, వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలికి ట్రంప్ హెచ్చరిక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha