Anil Ravipudi: విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్ రామ్ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ప్రమోషన్లు విభిన్నంగా షురూ అయ్యాయి. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి ఒక రోజు ముందు, మేకర్స్ 'కత్తిలాంటి ఐడియా' (Katthilanti Idea) పేరుతో ఒక ఫన్నీ వీడియోను రిలీజ్ చేశారు.
ప్రస్తుతం ఈ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఫ్యాక్షన్ కాదు.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!
చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ పంచుకున్న ఈ వీడియోలో దర్శకుడు అనిల్ రావిపూడి చేతిలో కత్తి పట్టుకుని, “ప్రతీసారి ఐడియాలు నేనే చెప్పాలా” అంటూ ఫన్నీగా అసహనం ప్రదర్శిస్తారు. అంతలోనే అక్కడికి వచ్చిన హీరో వెంకటేష్, అనిల్ చేతిని కత్తితో సరదాగా గీసి, ఆ రక్తంతో బొట్టు పెట్టుకుంటారు. ఆ తర్వాత హీరో కల్యాణ్ రామ్, హీరోయిన్లు కీర్తి సురేశ్, కృతి శెట్టి కూడా అదే పద్ధతిని ఫాలో అవ్వడంతో అనిల్ రావిపూడి ఇచ్చే ఎక్స్‌ప్రెషన్లు నవ్వులు పూయిస్తాయి. అయితే ఈ చిత్రం రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్నప్పటికీ ఇది ఫ్యాక్షన్ సినిమా కాదని, సరికొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.
Anil Ravipudi: జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్
ఇటీవలే హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ ప్రాజెక్ట్, జూన్ 22 నుండి అధికారికంగా సెట్స్ పైకి వెళ్లనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సౌత్ సంస్థలు సహ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టిలు ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
2027 సంక్రాంతి రేసులో ‘విక్టరీ – నందమూరి’ లైనప్
తన ప్రతీ సినిమా ప్రమోషన్లలో వైవిధ్యాన్ని చూపించే అనిల్ రావిపూడి, ఈ మల్టీస్టారర్ కోసం కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఈ క్రేజీ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ లోని ఇద్దరు క్రేజీ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై అప్పుడే ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

