Adarsha Kutumbam: సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్ విక్టరీ వెంకటేశ్, 'మాటల మాంత్రికుడు' త్రివిక్రమ్ శ్రీనివాస్ ల చిత్రం 'ఆదర్శ కుటుంబం..
హౌస్ నెం.47 (ఏకే-47)’ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం సరికొత్త పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేసింది. గాంధీ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

వెంకటేశ్ కెరీర్‌లో 77వ మైలురాయిగా వస్తున్న ఈ సినిమాలో ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.
‘ప్రతి కుటుంబం గుర్తుంచుకోవాల్సిన తేదీ’.. క్లాస్ టైటిల్‌తో మాస్ యాక్షన్ ట్యాగ్!
‘ప్రతి కుటుంబం గుర్తుంచుకోవాల్సిన తేదీ’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన ఈ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఆదర్శ కుటుంబం’ అనే ఫ్యామిలీ టైటిల్‌కు ‘AK 47’ అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్ జత చేయడంతో, ఇది కేవలం క్లాస్ ఫ్యామిలీ డ్రామా మాత్రమే కాకుండా హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన విభిన్న కథాంశమని స్పష్టమవుతోంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ బాణీలు సమకూరుస్తుండగా, రవి కె. చంద్రన్ విజువల్స్ అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను చూసుకుంటున్నారు.
చివరిగా ‘గుంటూరు కారం’ సినిమాతో అలరించిన త్రివిక్రమ్, కొంత విరామం తర్వాత పూర్తి స్క్రిప్ట్ వర్క్‌తో ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. చాలా కాలం తర్వాత త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ బాటలో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.వెంకీ-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ ఫిక్స్..ఎప్పుడంటే?

