విtnadeep:వినియోగదారుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రముఖ సంస్థలకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-2 గట్టి షాక్ ఇచ్చింది. బూజు పట్టిన, పాడైపోయిన వెన్నను విక్రయించినందుకు గాను రత్నదీప్, అక్షయకల్ప ఫార్మ్స్ అండ్ ఫుడ్స్ సంస్థలకు భారీ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
One Way Loop: ఆ రూట్‌లో ట్రాఫిక్ కష్టాలు క్లోజ్!
Fines imposed on Ratnadeep and Akshayakalpa
అసలు ఏం జరిగిందంటే?
కాప్రా అశోక్ ఎన్‌క్లేవ్‌కు చెందిన సంధ్య అనే వినియోగదారురాలు 2025 జనవరి 28న సైనిక్‌పురిలోని రత్నదీప్ స్టోర్స్‌లో రూ.230 చెల్లించి ‘అక్షయకల్ప ఆర్గానిక్ కుకింగ్ బట్టర్’ కొనుగోలు చేశారు. అయితే, ఇంటికి వెళ్లాక ఆ వెన్నను పరిశీలించగా అది పూర్తిగా బూజు పట్టి, పురుగులు మరియు బ్యాక్టీరియాతో ఉండటం గమనించారు దీనిపై నిలదీసేందుకు స్టోర్‌కు వెళ్లగా, అక్కడి సిబ్బంది బాధ్యతారహితంగా వ్యవహరించడమే కాకుండా బాధితురాలిని బెదిరించారు. బాధితురాలు నేరుగా ‘అక్షయకల్ప’ సంస్థను ఆశ్రయించినప్పటికీ ఎటువంటి సానుకూల స్పందన లభించకపోవడంతో, ఆమె చివరికి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
Ratnadeep:కమిషన్ విచారణ మరియు తీర్పు
ఈ కేసుకు సంబంధించి జరిగిన విచారణలో, రత్నదీప్‌లో ఫ్రిజ్ ఉష్ణోగ్రతలను సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే వెన్న పాడైపోయిందని తేలింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషన్ అధ్యక్షుడు వళ్ళంట్ల నరసింహారావు, సభ్యులు పొరుపల్లి జవహర్ బాబు, సుమ వాలాలతో కూడిన బెంచ్ బాధితురాలికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
చెల్లించాల్సిన నష్టపరిహారం వివరాలు
- బాధితురాలికి వెన్న ధర రూ. 230 వెనక్కి ఇవ్వాలి.
- పరిహారంగా రత్నదీప్ సంస్థ రూ. 50,000 చెల్లించాలి.
- అదేవిధంగా అక్షయకల్ప సంస్థ కూడా పరిహారంగా రూ. 50,000 చెల్లించాలి.
- భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, ఇరు సంస్థలు కలిసి రూ. 1 లక్ష వినియోగదారుల సంక్షేమ నిధి ఖాతాలో జమ చేయాలని కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Epaper: epaper.vaartha.com

