Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వేసవిలో ఈత, నీటి ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

వేసవిలో ఈత, నీటి ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

వార్త 2 months ago

Summer Water Safety Awareness: వేసవి సెలవుల్లో నీటి ప్రమాదాల నుండి విద్యార్థులను రక్షించేందుకు ఆరా ఇగ్నైట్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సోమవారం ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో నీటి ప్రమాదాల నివారణ, రక్షణ జాగ్రత్తలపై పోస్టర్లను ఆవిష్కరించి విద్యార్థులకు చైతన్యం కల్పించారు. కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆర్డీఓ వసంతబాబు, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Read Also:Nara Lokesh Delhi Visit: మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన.. రాష్ట్రపతి భేటీ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

Summer Water Safety Awareness: ఆరా ఇగ్నైట్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వేసవిలో పిల్లలు చెరువులు, బావుల వద్దకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి లోతు తెలియకుండా దిగడం ప్రమాదకరమని, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే సీపీఆర్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కళ్యాణదుర్గం కేజీసీజీహెచ్‌ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులు త్రివిక్రమారావు, చిత్తయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు జాగ్రత్తలను వివరించారు.

కంబదూరు మండలం ములకలేడు జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాలలో ప్రధానోపా ధ్యాయులు పరమేశ్వరప్ప, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి చిత్తప్ప ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రస్ట్ ప్రతినిధులు సూచించిన ముఖ్య జాగ్రత్తలు ఇలా ఉన్నాయి: తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా పిల్లలను నీటి వనరుల వద్దకు పంపరాదు, చెరువులు-బావుల వద్ద హెచ్చరిక బోర్డులను గమనించాలి, ఈత రాని వారు లోతు తెలియని నీటిలోకి దిగకూడదు, అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్‌పై అవగాహన పెంపొందించు కోవాలి. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు లోకేష్, డాక్టర్ రాజేష్, డాక్టర్ శరణ్, రమేష్, హర్ష, ఉమా రెడ్డి తదితరులు, పాఠశాల సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వేసవిలో విద్యార్థుల భద్రత కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మండుతున్న ఎండలు: స్కూళ్లు 11 గంటలకే ముగించాలని ఉపాధ్యాయుల విజ్ఞప్తి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha