Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వెస్టిండీస్‌కు ఐసీసీ షాక్.. రోవ్‌మన్ పావెల్, రూథర్‌ఫర్డ్‌పై చర్యలు!

వెస్టిండీస్‌కు ఐసీసీ షాక్.. రోవ్‌మన్ పావెల్, రూథర్‌ఫర్డ్‌పై చర్యలు!

వార్త 1 week ago

ICC Reprimands Rovman Powell: భారత్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ విజయం సాధించినప్పటికీ, ఆ జట్టు ఆటగాళ్లకు ఐసీసీ నుంచి చర్యలు ఎదురయ్యాయి.

వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్, బ్యాటర్ షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్‌ను ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఐసీసీ మందలించింది. ఇద్దరికీ చెరో డీమెరిట్ పాయింట్ విధించినట్లు సమాచారం.

Prithvi Shaw Akriti Agarwal: విడిపోతున్నామన్న కొన్ని వారాలకే యూటర్న్.. పృథ్వీ షా జంట ప్రకటన

పావెల్, రూథర్‌ఫర్డ్ ఏం చేశారు?

అక్టోబర్ 9న రాంచీలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా పావెల్, రూథర్‌ఫర్డ్ ప్రవర్తనపై ఐసీసీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పావెల్ బ్యాట్‌తో బంతిని బాదిన ఘటనను, రూథర్‌ఫర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన విషయాన్ని ఐసీసీ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం.

ICC Reprimands Rovman Powell: ఇద్దరికీ చెరో డీమెరిట్ పాయింట్

మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి ఇద్దరు ఆటగాళ్లను మందలించడంతో పాటు ఒక్కొక్కరికి ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రవర్తనా నియమావళిని పాటించాల్సి ఉంటుంది. ఇలాంటి ఉల్లంఘనలకు ఆటగాళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

Epaper: epaper.vaartha.com

టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha