Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విచిత్ర వాతావరణం..ఓ పక్క ఎండ..మరో పక్క వాన!

విచిత్ర వాతావరణం..ఓ పక్క ఎండ..మరో పక్క వాన!

వార్త 7 hrs ago

Telugu States Unseasonal Rains: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు భానుడి భగభగలతో ఎండలు తీవ్రంగా దంచికొడుతుండగా, మరోవైపు పలు ప్రాంతాల్లో అకాల భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వానలు కురిసి వాతావరణాన్ని ఒక్కసారిగా చల్లబరిచాయి.

పల్నాడు, కృష్ణా జిల్లాల్లో వాన బీభత్సం

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వండ్రం పడటంతో పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లి వరద నీరు రోడ్లపైకి పెద్ద ఎత్తున వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు, దీనివల్ల పట్టణంలో గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అలాగే కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోనూ బలమైన ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.

Telugu States Unseasonal Rains: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈదురుగాలుల కలకలం

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ వర్షాలు కలకలం రేపాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని పలు మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఆకాశం పూర్తిగా మేఘావృతమై బలమైన ఈదురుగాలులతో కూడిన వానలు కురిశాయి. గాలివాన కారణంగా ఐలాండ్స్, ఓపెన్ యార్డులలో ఆరబోసిన ధాన్యం కుప్పలపైకి నీరు చేరకుండా కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎండల తీవ్రత నుండి ఈ వర్షాలు తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పంట తడిసిపోతుందేమోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాబోయే రెండు రోజులు కూడా ఈ అకాల వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

జడ్చర్ల లో గాలివాన బీభత్సం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha