Trump shocks foreign pharmaceutica
Trump shocks foreign pharmaceutical: కంపెనీలపై 20 శాతం పన్ను
అమెరికా ప్రభుత్వంతో ‘మోస్ట్ ఫేవరెడ్ నేషన్’ ధరల ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలతో పాటు అమెరికాలోనే తమ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసే సంస్థలకు ఎటువంటి పన్ను ఉండదు. మరోవైపు, అమెరికాలో ప్లాంట్లను నిర్మిస్తూ, ఇంకా ధరల ఒప్పందం కుదుర్చుకోని కంపెనీలపై 20 శాతం పన్ను విధిస్తారు. అయితే, రాబోయే నాలుగేళ్లలో వీరు ఒప్పందాలు చేసుకోకపోతే, సుంకాలను 100 శాతానికి పెంచనున్నట్లు ట్రంప్ ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అమెరికాతో ఫార్మా కంపెనీలు చర్చలు జరిపేందుకు ట్రంప్ సర్కార్ గడువును నిర్దేశించింది. భారీ ఫార్మా కంపెనీలకు 120 రోజులు, చిన్న తరహా కంపెనీలకు 180 రోజులు గడువును ఇచ్చింది. ఈ గడువు ముగిసిన తర్వాత నిబంధనలు పాటించని కంపెనీలపై 100 శాతం టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయని ఉత్తర్వుల్లో ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
హర్ముజ్ జలసంధిలో నౌకలపై పన్నుల వాత.. సామాన్యుడికి తప్పని ఇంధన సెగ!

