Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్య నాణ్యత పేరుతో అనుభవానికి పరీక్ష?

విద్య నాణ్యత పేరుతో అనుభవానికి పరీక్ష?

వార్త 1 week ago

Teacher Eligibility Test : దేశ నిర్మాణంలో ఉపాధ్యాయు డి పాత్రకు ప్రత్యామ్నాయం లేదు. రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కు సాకారం కావాలంటే పాఠశాల లుండాలి, పాఠ్యపుస్తకాలు ఉండాలి, మౌలిక సదుపాయాలు ఉండాలి.

కానీ ఇవన్నింటికంటే ముఖ్యంగా నిబద్ధత, నైపుణ్యం, అనుభవం కలిగిన ఉపాధ్యా యుడు ఉండాలి. అందుకే ఉపాధ్యా య నియామకాల్లో నాణ్యతా ప్రమా ణాలను తీసుకురావాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ప్రవేశపెట్టారు. ప్రారం భంలో ఈ నిర్ణయం విద్యా సంస్కరణగా ప్రశంసలు అందు కున్నప్పటికీ, కాలక్రమేణా అదే టెట్ ఇప్పటికే ఉద్యోగాల్లో కొనసాగుతున్న ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా తప్పని సరిగా మారిన సందర్భాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. దశాబ్దాలుగా బోధనలో విశిష్ట సేవలందిస్తున్న ఉపాధ్యాయు డు మరోసారి పరీక్ష రాసి తన అర్హతను నిరూపించుకోవా ల్సి రావడం ఎంతవరకు సమంజనం అనే ప్రశ్న ఇప్పుడు విద్యారంగంలో ప్రధాన చర్చగా మారింది. 2009లో విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జాతీయ ఉపాధ్యా య విద్యామండలి (ఎన్సీటీఈ) ఉపాధ్యాయ అర్హతకు దేశ వ్యాప్తంగా కనీస ప్రమాణాలను నిర్దేశించింది. ఆ మార్గదర్శ కాల ప్రకారం టెట్ను ప్రవేశపెట్టారు. కొత్తగా నియమితుల య్యే ఉపాధ్యాయులకు ఇది అవసరమనే విషయంలో పెద్ద గా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు.

 Teacher Eligibility Test

Teacher Eligibility Test : అదనపు భారం

అయితే టెట్ అమలుకు ముందు నియమితులై, ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఇన్సర్వీస్ ఉపాధ్యా యుల పైనా ఈ నిబంధనలను వర్తింప జ యడం వివా దాస్పదమైంది. ఒకవైపు ఉపాధ్యాయులపై రోజురోజుకూ బాధ్యతలు పెరుగుతున్నాయి. తరగతి బోధనతో పాటు మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ, విద్యార్థుల హాజరు నమోదు, వివిధ ప్రభుత్వ సర్వేలు, ఓటరు జాబితాల సవ రణ, ఎన్నికల విధులు, జనగణన, సంక్షేమ పథకాల అమలు, డిజిటల్ డేటా నమోదు, తల్లిదండ్రుల సమావే శాలు, శిక్షణా కార్యక్రమాలు, పాఠశాల పరిపాలన ఇలా అనేక పనులు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరోసారి టెట్ పరీక్షకు సిద్ధం కావడం వారికి అదనపు భారం అవు తోంది. ముఖ్యంగా 45 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు గల ఉపాధ్యాయులు ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ మళ్లీ పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాల్సి రావడం తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. ఇన్సర్వీస్ ఉపాధ్యాయులలో చాలామంది పదిహేను, ఇరవై, ముప్పై సంవత్సరాలకు పైగా సేవలందిస్తున్నారు. వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చారు. వైద్యులు, ఇంజి నీర్లు, శాస్త్రవేత్తలు, పరిపాలనా అధికారులు, న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులను తీర్చిదిద్దిన గురువులే నేడు మరోసారి అర్హతను నిరూపించుకోవాల్సి రావడం సహజం గానే బాధను కలిగిస్తోంది.

కొన్ని రాష్ట్రాలలో మినహాయింపులు

ఒక ఉపాధ్యాయుడి సామర్ధ్యాన్ని అతని విద్యార్థుల విజయాలు, సేవా చరిత్ర, తరగతి గది నిర్వహణ, సామాజిక బాధ్యతలు తెలియజేస్తే, వాటిని పక్క నబెట్టి కేవలం ఒక ప్రశ్నాపత్రం ఆధారంగా అంచనా వేయ డం న్యాయమా అనే ప్రశ్నకు విద్యాశాఖ సమాధానం చెప్పా ల్సి ఉంది. టెట్పరీక్ష ప్రధానంగా బహుళైచ్ఛిక ప్రశ్నల రూ పంలో నిర్వహించబడుతుంది. బాల మనోవిజ్ఞానం, బోధనా పద్ధతులు, భాష, గణితం, విజ్ఞానశాస్త్రం, సామాజికశాస్త్రం వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇవి సిద్ధాంతపరమైన అవగాహనను పరీక్షించ గలవు. కానీ ఒక ఉపాధ్యాయుడి బోధనా నైపుణ్యం, విద్యార్థులను ప్రేరేపించే సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే చాతుర్యం, విలువల బోధన, తరగతి గది నిర్వహణ వంటి లక్షణాలను పూర్తిగా కొల వలేవు. అనుభవం ద్వారా వచ్చిన ప్రజ్ఞను ప్రశ్నాపత్రంతో కొలవడం సాధ్యం కాదని అనేక మంది విద్యావేత్తలు స్పష్టం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పాఠశాల విద్యావ్యవస్థలో సుమారు 95 లక్షలకు పైగా ఉపాధ్యాయులు సేవలందిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ గణాంకాలు సూచిస్తున్నాయి. వీరిలో గణ నీయమైన సంఖ్యలో టెట్ అమలుకు ముందే నియమితులై నవారే. కొన్ని రాష్ట్రాలు వారికి మినహాయింపులు ఇచ్చాయి. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం టెట్ ఉత్తీర్ణతను తప్పనిసరి చేశాయి. ఒకే దేశంలో ఒకే విధానానికి వేర్వేరు అమలు విధానాలు ఉండటం వల్ల ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది.

ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ

ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి నిర్దేశిత ప్రమాణాలకు చేరని పాఠశాలలు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల శక్తిని పరీక్షలకే పరిమితం చేయడం కంటే, పాఠశాలల విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించడం అవసరమనే అభి పాయం బలంగా వినిపిస్తోంది. పరీక్షలు నిర్వహించడం కన్నా తర గతి గదిలో బోధనా నాణ్యతను పెంచేకార్యక్రమాలు చేపట్ట డం మరింత ప్రయోజనకరమని నిపుణులు సూచిస్తున్నారు. జాతీయ విద్యా విధానం- 2020 ఉపాధ్యాయుడిని విద్యా వ్యవస్థకు కేంద్రబిందువుగా పేర్కొంది. ఉపాధ్యాయుడు జీవి తాంతం నేర్చుకుంటూ ఉండాలని, సేవలో ఉన్న సమయం లోనూ నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించింది. అయితే ఆ విధానం కూడా పరీ క్షలకే పరిమితం కాలేదు. శిక్షణ, పరిశోధన, సాంకేతిక పరి జ్ఞాన వినియోగం, తరగతి గది పరిశీలన, నూతన బోధనా విధానాల అవలంబన వంటి అంశాలకు ప్రాధాన్యంఇచ్చింది. అందువల్ల ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల విషయంలో కూడా అదే దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.

నిరంతర శిక్షణా కార్యక్రమాలు

ప్రపం చంలోని అనేక దేశాల్లో సేవలో ఉన్న ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారి తరగ తులను పరిశీలించి సూచనలుఇస్తారు. బోధనా పద్ధతులను నవీకరించే కార్యశాలలు నిర్వహిస్తారు. విద్యార్థుల అభ్యాస ఫలితాలు, తల్లిదండ్రుల అభిప్రాయాలు, పాఠశాల వరిశీలన నివేదికలు వంటి అనేక అంశాల ఆధారంగా వారి పనితీరును అంచనా వేస్తారు. ప్రతి కొన్నేళ్లకోసారి అర్హత పరీక్షలు నిర్వ హించడం సాధారణ పద్ధతి కాదు. భారతదేశం కూడా పరీక్షా సంస్కృతికి బదులుగా నైపుణ్యాభివృద్ధి సంస్కృతిని పెం పొందించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయుల ఆత్మగౌర వం దెబ్బతింటే దాని ప్రభావం నేరుగా విద్యార్థులపై పడు తుంది. గురువును అనుమానంతో చూడడం కాదు, విశ్వా సంతో బలోపేతం చేయడం ప్రభుత్వాల బాధ్యత. విద్యా నాణ్యత పేరుతో తీసుకునే ప్రతి నిర్ణయం ఉపాధ్యాయుల మనోధైర్యాన్ని పెంచేదిగా ఉండాలి. దశాబ్దాల సేవ చేసిన గురువును మళ్లీ పరీక్షల ముందు నిలబెట్టడం కంటే, ఆధు నిక బోధనా పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, డిజిటల్ విద్యలో ప్రావీణ్యం కల్పించడం, కృత్రిమ మేధన్సు ఆధా రిత బోధనా సాధనాల వినియోగంపై అవగాహన కల్పించ డం వంటి చర్యలు విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రయోజ నం చేకూరుస్తాయి. విద్యా నాణ్యత అనేది కేవలం పరీక్షల తో పెరగదు.

 Teacher Eligibility Test

విద్యా వ్యవస్థ బలోపేతం

పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు, ఆధునిక బోధనా సామగ్రి, నిరం తర శిక్షణ, సమర్థవంతమైన పర్యవేక్షణ, విద్యార్ధి కేంద్రిత బోధన ఇవి అన్నీ కలిసివచ్చినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి. టెట్ ఒక్కటే విద్యా ప్రమాణాలకు కొల మానం కాదనే విషయాన్ని పాలకులు గుర్తించాలి. ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల విషయంలో అనుభవానికి తగిన గౌరవం ఇవ్వాలి. ఇప్పటికే సేవలో ఉన్న ఉపాధ్యాయులను పదేపదే పరీక్షల బాట పట్టించడం వల్ల వారి సమయం, శ్రమ, మాన సిక ప్రశాంతత దెబ్బతింటాయి. అదే సమయాన్ని వారు విద్యార్థుల అభ్యాసాభివృద్ధికి వినియోగిస్తే సమాజానికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఉపాధ్యాయుడు పరీక్ష రాసే అభ్యర్థి కాదు పరీక్షలకు తరాలను సిద్ధం చేసే మహో న్నత గురువు. ఆయన జ్ఞానాన్ని, అనుభవాన్ని, సేవాస్ఫూర్తిని గౌరవించడం నాగరిక సమాజ లక్షణం. విద్యా నాణ్యత’ను పెంపొందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఎవరూ వ్యతి రేకించరు. కానీ ఆ లక్ష్యం సాధించే మార్గం ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడేదిగా, వారి అనుభవాన్ని సద్వినియోగం చేసేదిగా, విద్యార్థి ప్రయోజనాలను ముందుంచేదిగా ఉండాలి. టెట్ పరీక్షలు విద్యా వ్యవస్థను బలోపేతం చేసే సాధనంగా నిలవాలి గానీ, ఇన సర్వీస్ ఉపాధ్యాయులకు అంతులేని పరీక్షా ప్రయాణంగా మారకూడదు.

-రామ కిష్టయ్య సంగనభట్ల

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

హైదరాబాద్‌లో ప్రైవేటు స్కూళ్ల ఫీజుల మోత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha