Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విద్యార్థుల శ్రమకు చట్టబద్ధ రక్షణ కవచం!

విద్యార్థుల శ్రమకు చట్టబద్ధ రక్షణ కవచం!

వార్త 2 weeks ago

Students : దేశంలో ప్రతి సంవత్సరం లక్ష లాది మంది యువత ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్య ప్రవేశాలు, వివిధ పోటీ పరీక్షల కోసం అపార మైన శ్రమతో సిద్ధమవుతుంటారు.

వారి ఆశలు, ఆశయాలు, భవిష్యత్తు అంతా ఈ పరీక్షల ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీ వల కాలంలో ప్రశ్నపత్రాల లీకేజీలు, సంఘటిత పరీక్షా అక్రమాలు, డిజిటల్ మోసాలు తరచూ వెలుగుచూడ డం వల్ల ప్రతిభకు బదులుగా అక్రమాలకు అవకాశం లభి స్తోందనే ఆందోళన దేశవ్యాప్తంగా వ్యక్తమైంది. ముఖ్యంగా నీట్ యూజీ వంటి జాతీయస్థాయి పరీక్షల చుట్టూ ఏర్పడిన వివాదాలు విద్యార్థులలోనే కాక సమాజంలో కూడా పరీక్షా వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఈనేపథ్యంలో విద్యా ర్థుల శ్రమను రక్షిస్తూ, పరీక్షల విశ్వసనీయతను పునరుద్ధ రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ చట్టం 2026 ఒక కీలకమైన సంస్కరణగా చెప్పవచ్చు. వాస్తవానికి, 2024లో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్) యాక్ట్ను అమల్లోకి తీసుకొచ్చింది. యూపీఎస్సీ ఎస్ఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు, ఐబీపీఎస్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వంటి కేంద్ర సంస్థలు నిర్వహించే పరీక్షల్లో అక్రమాలను అరికట్టడమే ఆ చట్టం లక్ష్యం. అయితే సాంకే తిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలు, ప్రశ్నపత్రాల డిజిటల్ లీకేజీలు, అంతర్రాష్ట్ర స్థాయిలో పని చేసే ముఠాల కార్యకలాపాలు పెరగడంతో 2024 చట్టంలోని నిబంధనలు సరిపోవని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేప థ్యంలోనే మరింత కఠినమైన నిబంధనలతో 2026సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఈ సవరణ చట్టం పరిధి కూడా విస్తృతంగా ఉంది.

 Students

Students : పరీక్షావ్యవస్థను దెబ్బతీసే లీకేజీ

కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు వాటి అనుబంధ సంస్థలు నిర్వహించే అన్ని రకాల పబ్లిక్ పరీక్షలకు ఇది వర్తిస్తుంది. అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వా లు కూడా ఈ చట్టాన్ని నమూనాగా స్వీకరించి తమ రాష్ట్రాల్లో అమలు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ము ఖ్యంగా నిజాయితీగా పరీక్షలు రాసే సాధారణ విద్యార్థులను ఈ చట్టం నేరస్థులుగా పరిగణించదు. పరీక్షావ్యవస్థను దెబ్బ తీసే లీకేజీ ముఠాలు, అక్రమాలకు పాల్పడే సంస్థలు, కోచింగ్ సిండికేట్లు, ఇతర వ్యవస్థీకృత నేరగాళ్లపైనే దీని దృష్టి కేంద్రీ కృతమైంది. ఈ చట్టంలో అత్యంత ముఖ్యమైన అంశం శిక్ష లను గణనీయంగా కఠినతరం చేయడం. 1 గతచట్టంలో వ్యక్తి గత అక్రమాలకు 3 నుండి 5సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 10 లక్షల వరకు జరిమానా ఉండగా, ఇప్పుడు 5 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతోపాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధించేలా నిబంధనలు మార్చారు. సంఘ టిత నేరాలకు పాల్పడే ముఠాలపై కనీసం 7 నుండి 10 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా విధించే అవకాశం కల్పించారు. పరీక్షల నిర్వహ ణలో భాగస్వాములైన థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు లేదా డిజిటల్ ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడితే రూ.5కోట్లవరకు జరిమానా విధించడంతోపాటు ఎనిమిదేళ్లపాటు పరీక్షలనిర్వ హణ నుంచి నిషేధించవచ్చు. పరీక్ష నిర్వహణకు అయిన మొత్తం వ్యయాన్ని కూడా వారి నుంచే వసూలు చేసే నిబంధనను చేర్చడం ఈచట్టం ప్రత్యేకత.

వేగవంత మైన విచారణ

శిక్షలను పెంచడ మేకాకుండా, విచారణ ప్రక్రియను వేగవంతం చేయడంపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే అవకాశం కల్పించారు. నేరం నమోదైన రెండు నెలల్లోపు దర్యాప్తు పూర్తిచేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలి. అనంతరం మూడు నెలల్లో కోర్టు తీర్పు ఇవ్వాలని సమయపరిమితి నిర్ణయించారు. అంటే మొత్తం ఐదు నెలల్లోనే కేసు విచా రణ పూర్తయ్యేలా చట్టం లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్రాష్ట్ర స్థాయిలో పనిచేసే పేవర్ లీకేజీ ముఠాలను అణచివేయడా నికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి కల్పించారు. అక్రమాలకు పాల్పడిన సంస్థలు లేదా వ్యక్తుల ఆస్తులను జప్తు చేసే అధికారాన్ని కూడా ఈచట్టం కల్పించడం గమనార్హం. ఈ నూతన చట్టం వల్లఎక్కువగా లాభపడేది నిజాయితీగా కష్టపడి చదివేవిద్యా ర్థులే. కఠినమైన శిక్షలు, భారీ జరిమానాలు అక్రమాలకు పాల్పడే ముఠాలకు గట్టి హెచ్చరికగా నిలుస్తాయి. వేగవంత మైన విచారణవల్ల పరీక్షల ఫలితాలు సంవత్సరాల తరబడి అనిశ్చితిలో ఉండే పరిస్థితి తగ్గుతుంది. పారదర్శకత పెరగ డంద్వారా విద్యా, ఉద్యోగ నియామక వ్యవస్థలపై యువత లో తిరిగి విశ్వాసం పెరుగుతుంది. పరీక్షల నిర్వహణలో భాగస్వాములైన డిజిటల్ సంస్థలు, సాంకేతిక సేవల సంస్థలు కూడా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే చట్టం తీసుకురావడం ఒక్క టే సమస్యకు సంపూర్ణ పరిష్కారంకాదు. దీని సమర్ధవంత మైన అమలే విజయాన్ని నిర్ణయిస్తుంది.

 Students

సైబర్ భద్రతా ప్రమాణాల

బ్లూటూత్ పరిక రాలు, హ్యాకింగ్, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వంటి అత్యాధు నిక సైబర్ నేరాలను తక్కువ సమయంలో దర్యాప్తు చేయ డం సవాలుతో కూడుకున్న అంశం. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు సమర్థంగా పనిచేయాలంటే తగిన సంఖ్యలో న్యాయమూర్తులు, సిబ్బంది, మౌలిక వసతులు అందుబాటులో ఉండాలి. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల పోలీసువ్యవస్థల మధ్య సమ న్వయం బలపడాల్సిన అవసరం కూడాఉంది. ముందుచూపు తో వ్యవహరించాలంటే కేవలం శిక్షలను కఠినతరం చేయ డం సరిపోదు. ప్రశ్నపత్రాల రూపకల్పన నుంచి మూల్యాం కనంవరకు అత్యున్నత స్థాయి సైబర్ భద్రతా ప్రమాణాలను అమలు చేయాలి. పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ ధృవీకరణ, కృత్రిమమేధ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను విస్తృతం గా వినియోగించాలి. పరీక్షా అక్రమాలపై ముందస్తు సమాచా రం అందించే విజిల్ బ్లోయర్లకు చట్టబద్ధ రక్షణ కల్పించడం కూడా అంతే అవసరం. మొత్తంగా చూస్తే, పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ చట్టం 2026 కేవలం ఒకశిక్షా చట్టం మాత్రమే కాదు, దేశంలోని కోట్లాది మంది విద్యార్థుల శ్రమకు, ప్రతిభకు, భవిష్యత్తుకు . ప్రభుత్వం ఇచ్చిన చట్టబద్ధ మైన భరోసా. పరీక్షలలో పారదర్శకతను పెంపొందించడం, అక్రమాలను అరికట్టడం, ప్రతిభకు సముచిత గౌరవం కల్పిం చడం వంటి లక్ష్యాల సాధనకు ఇది బలమైన అడుగు.”

-ఆచార్య దారపురెడ్డి సూర్యచంద్రరావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల ప్రవేశాలు ప్రారంభం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha