Ranabaali : టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలసి నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'రణబాలి' విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తుండటంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ఈ సినిమా ప్రారంభ సమయంలోనే మేకర్స్ సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. విజయ్-రష్మిక కాంబినేషన్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రంపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తయ్యే సంకేతాలు కనిపించకపోవడంతో సినిమా చెప్పిన తేదీకి రావడం కష్టమేననే ప్రచారం ఫిలింనగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

షూటింగ్ ఆలస్యానికి కారణాలు: త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటన?
ఈ ప్రతిష్టాత్మక చిత్రం వాయిదా పడటానికి ప్రధానంగా విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలే కారణమని ఇండస్ట్రీ సమాచారం. వీరిద్దరి వివాహ వేడుకల కారణంగా కొన్ని రోజుల పాటు సినిమా చిత్రీకరణకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. దీనికి తోడు నిర్మాణంలో క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని మేకర్స్ భావిస్తుండటంతో ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరికొంత సమయం పట్టేలా ఉంది. నిశ్చయించిన సెప్టెంబర్ 11 నాటికి అవుట్‌పుట్ సిద్ధం చేయడం సాధ్యం కాదని భావించిన నిర్మాతలు, త్వరలోనే సినిమా కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

