Rashmika tattoo meaning: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన నటనతోనే కాకుండా, వ్యక్తిగత విషయాలతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు.
ఆమె కుడిచేతి మణికట్టుపై ఉన్న ‘ఇర్రీప్లేసబుల్’ అనే టాటూ గురించి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వస్తున్నాయి . ఈ టాటూను ఆమె హీరో విజయ్ దేవరకొండ కోసమే ప్రత్యేకంగా వేయించుకుందంటూ నెటిజన్లు ఎవరికి నచ్చినట్లు వారు కథనాలను ప్రచారం చేస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించిన రష్మిక, ఈ టాటూ వెనుక ఉన్న అసలైన నిజాన్ని, ఆసక్తికరమైన నేపథ్యాన్ని బయటపెట్టి ఆ పుకార్లకు పూర్తిగా చెక్ పెట్టారు.
Read Also : Toxic movie: 'టాక్సిక్' సినిమా ఆలస్యంపై స్పందించిన యశ్
Not for Vijay Deverakonda.. Rashmika Clarity on Tattoo
Rashmika tattoo meaning: కాలేజీ అబ్బాయి విసిరిన ఛాలెంజ్
తనకు మొదట్లో శరీరంపై ఎలాంటి టాటూ వేయించుకోవాలనే ఆలోచనే లేదని రష్మిక స్పష్టం చేశారు. కానీ ఆమె కాలేజీ చదువుతున్న రోజుల్లో జరిగిన ఒక చిన్న సంఘటన ఆమె మనసును బలంగా తాకింది. ఒకరోజు కాలేజీలో ఒక అబ్బాయి రష్మిక దగ్గరకు వచ్చి, ఆడపిల్లలు అస్సలు నొప్పిని భరించలేరని… వారికి సూదులు, ఇంజెక్షన్లు అంటే చాలా భయమని కాస్త ఎగతాళిగా మాట్లాడాడు. ఆ మాటలను ఒక ఛాలెంజ్‌గా తీసుకున్న రష్మిక… ఆడవాళ్లు ఎంతటి నొప్పినైనా ఓర్చుకోగలరని నిరూపించడానికి, ఆ అబ్బాయి గర్వాన్ని అణచడానికే ఎలాగైనా టాటూ వేయించుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు.
‘ఇర్రీప్లేసబుల్’ పదాన్నే ఎందుకు ఎంచుకున్నారంటే?
తీరా టాటూ వేయించుకోవాలని ఫిక్స్ అయిన తర్వాత, చేతిపై ఎలాంటి పదాన్ని రాయించుకోవాలా? అని చాలా సమయం ఆలోచించానని రష్మిక వెల్లడించారు. తన జీవితంలో రియల్‌గా ఉండాలని కోరుకునే రష్మికకు ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషిని మరొకరు ఎప్పటికీ భర్తీ చేయలేరని, ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో ప్రత్యేకమైనవారని ఆమె బలంగా నమ్ముతారు. ఆ విషయాన్ని ప్రతిరోజూ తనకు తాను గుర్తుచేసుకోవడానికి, ‘ఇర్రీప్లేసబుల్’ అనే పదాన్ని టాటూగా ఎంచుకున్నట్లు రష్మిక క్లారిటీ ఇచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
'డ్రాగన్' నుంచి క్రేజీ అప్డేట్.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ టైం ఫిక్స్!

