VDxShouryuv: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, 'హాయ్ నాన్న'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు శౌర్యువ్ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త చిత్రం (#VDxShouryuv) ఇప్పుడు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది.
ఇది విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మరియు భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా ఉండబోతోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం కేవలం ఒక మామూలు సినిమా కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్.
Read Also:Hansika Motwani: హార్మోన్ ఇంజెక్షన్ల పుకార్లపై క్లారిటీ!
VDxShouryuv: ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులు
'ఖుషి' చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు కూడా బాణీలు కడుతున్నాడు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ భావోద్వేగంగా స్పందిస్తూ, శౌర్యువ్ అద్భుతమైన ఊహాశక్తితో తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా సవాల్‌తో కూడుకున్నదని, దీనికోసం తన శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం పోస్టర్‌ను విడుదల చేసింది.గ్రీన్ కలర్ డ్రెస్‌లో విజయ్ దేవరకొండ లుక్ అదిరిపోయింది. రెండు చేతులలో గొలుసులతో కట్టేసిన నాలుగు కుక్కలను తీసుకుని వెలుతున్నాడు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
వాస్తవానికి హాయ్ నాన్న తర్వాత దర్శకుడు శౌర్యువ్ జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ చిత్రం పట్టాలెక్కలేదు. ఇక ఇదే కథను విజయ్ దేవరకొండకు చెప్పగా ఓకే చేసినట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఇప్పుడు అఫీషియల్‌గా శౌర్యువ్, విజయ్ కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. ఇది ఎన్టీఆర్‌తో చేయాల్సిన కథనేనా? లేక మరో కథనా అన్నది తెలియాల్సి ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

