Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ 'జన నాయగన్' రిలీజ్ డేట్ ఫిక్స్?

విజయ్ 'జన నాయగన్' రిలీజ్ డేట్ ఫిక్స్?

వార్త 3 weeks ago

Jana Nayagan Release Date: తమిళ అగ్ర నటుడు దళపతి విజయ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న లేటెస్ట్ మూవీ 'జన నాయగన్' విడుదలకు ఎట్టకేలకు సిద్ధమైంది.

విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సినిమా రిలీజ్‌కు ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కొత్త విడుదల తేదీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Read Also : Peddi Movie: పెద్ది ప్రమోషన్స్.. పర్పుల్ లెహంగాలో మెరిసిన జాన్వీ కపూర్

 Vijay’s ‘Janayagan’ release date fixed?

Jana Nayagan Release Date: బుకింగ్ యాప్స్‌లో ప్రత్యక్షమైన రిలీజ్ డేట్

తాజా సమాచారం ప్రకారం, ‘జన నాయగన్’ చిత్రాన్ని జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 22న విజయ్ పుట్టినరోజు ఉండటంతో, అభిమానులకు మూడు రోజుల ముందే గ్రాండ్ బర్త్‌డే ట్రీట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్స్‌లో ఈ సినిమా విడుదల తేదీ జూన్ 19గా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha