Rashmika Mandanna: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా పీరియాడిక్ డ్రామా 'రణబాలి' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంటోంది.
ఈ నేపథ్యంలో సినిమా విజయం పట్ల, తన భర్త విజయ్ దేవరకొండ నటన పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నటి రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన, ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ఈ చిత్రంలో తాను పోషించిన 'జయమ్మ' పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. "జయమ్మ ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. ఒక నిజమైన మహిళ ఎలా ఉండాలో, తన వాళ్ల కోసం ఎలా నిలబడాలో ఆ పాత్ర నాకు నేర్పింది" అని పేర్కొన్నారు.
Vijay Sethupathi Movie: విజయ్ సేతుపతి పాన్-ఇండియా మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్
I have always been a big fan of Vijay's acting - Rashmika Mandanna's emotional post
Rashmika Mandanna: అదే 'రణబాలి' అసలైన కథ..
'రణబాలి' సినిమాకు, జయమ్మ పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రేమాభిమానాలకు తాను సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నానని రష్మిక తెలిపారు. ఈ చిత్రం మన సమాజ బలాన్ని, దేవుడిపై నమ్మకాన్ని, కష్టకాలంలోనూ కలిసికట్టుగా ఉండే తత్త్వాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పింది. "బయటి నుంచి ఎవరైనా మన జోలికి వస్తే చూస్తూ ఊరుకోం, మనమంతా కలిసి పోరాడతాం. అదే 'రణబాలి' కథ" అంటూ సినిమాలోని ప్రధాన అంశాన్ని ఆమె వివరించారు.
విజయ్ దేవరకొండపై ప్రశంసల జల్లు & దర్శకుడు రాహుల్‌కు అభినందనలు
విజయ్ దేవరకొండ నటనను ప్రశంసిస్తూ రష్మిక రాసుకొచ్చిన మాటలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. @thedeverakonda - నీ నటనకు నేను ఎప్పుడూ అభిమానినే. నీ కష్టానికి, నటనకు అందరి నుంచి ప్రశంసలు వస్తుంటే చూడటానికి నాకెంతో సంతోషంగా, ప్రశాంతంగా ఉంది అంటూ విజయ్ విజయాన్ని తన విజయంగా భావిస్తూ మనసులోని భావాలను పంచుకున్నారు. అలాగే, మన దేశంలోని అద్భుతమైన దర్శకులలో రాహుల్ సాంకృత్యన్ ఒకరని కొనియాడుతూ, ఆయన కథ చెప్పే విధానం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ సంపూర్ణ ప్రేమతో, మీ జయమ్మ అంటూ ఆమె తన పోస్టును ముగించారు.
Epaper: epaper.vaartha.com

