Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ ప్రమాణ స్వీకారం: తమిళ గీతంపై వివాదం!

విజయ్ ప్రమాణ స్వీకారం: తమిళ గీతంపై వివాదం!

వార్త 3 months ago

Vijay CM Oath Ceremony Controversy: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్,ఆయన మంత్రివర్గం బాధ్యతలు చేపట్టిన వేళ ప్రోటోకాల్ వివాదం తెరపైకి వచ్చింది.

దశాబ్దాలుగా తమిళనాడు ప్రభుత్వ కార్యక్రమాలు రాష్ట్ర గీతంతో, ప్రారంభమై, జాతీయ గీతంతో ముగియడం ఆనవాయతీ. అయితే, ఆదివారం జరిగిన వేడుకలో తొలుత వందేమాతరం, ఆ తర్వాత జాతీయ గీతం, చివరగా తమిళ గీతాన్ని ఆలపించడం చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో వందేమాతరం, జనగణమన తర్వాత మూడో స్థానంలో తమిళతాయి వాల్తును పాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమిళనాడు సీపీఐ కార్యదర్శి ఎం. వీరపాండియన్ ఒక లేఖను విడుదల చేశారు.

Read Also: Himanta Biswa Sarma: అస్సాం సీఎంగా మళ్ళీ హిమంత బిశ్వ శర్మ!

 Tamil Thai Valthu Controversy

Vijay CM Oath Ceremony Controversy: తమిళతాయ్ వాల్తుకు ప్రాధాన్యం

రాజ్‌భవన్ జారీ చేసిన ఆదేశాల మేరకు, తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమ షెడ్యూల్‌లో వందేమాతరం గీతానికి ప్రాధాన్యతనిస్తూ, తమిళ గీతాన్ని మూడో స్థానంలో ఉంచడం అనేది తమిళనాడులో కొనసాగుతున్న సంప్రదాయాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారో తమిళనాడు ప్రభుత్వం ప్రజలకు చెప్పాలన్న వీరపాండియన్.. తమిళతాయ్ వాల్తుకు ప్రాధాన్యం లభించేలా టీవీకే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం…ఆనందం తో త్రిష కన్నీరు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha