Vijay - Rashmika: టాలీవుడ్‌లో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - హీరోయిన్ రష్మిక మందన్నపెళ్లి వార్తలు ఇప్పుడు మరింత జోరందుకున్నాయి.
ఇప్పటివరకు ఈ ఇద్దరూ మేము కేవలం మంచి స్నేహితులమే అంటూ బహిరంగంగా చెబుతూ వచ్చినప్పటికీ, తాజాగా వినిపిస్తున్న ప్రచారాలు సినీ అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి.ఈ నెల చివరి వారంలో వీరి పెళ్లి జరగనుందనే టాక్ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

గ్రాండ్ గా రిసెప్షన్
సినీ వర్గాల నుంచి లభిస్తున్న సమాచారం ప్రకారం, రాజస్థాన్‌లోని అందమైన నగరం ఉదయ్‌పూర్ లోని ఓ రాయల్ ప్యాలెస్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సింపుల్‌గా పెళ్లి వేడుక జరపాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26 తేదీని ముహూర్తంగా ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.కానీ రష్మిక, విజయ్ చేతులకు ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉన్నాయని, త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారని ఫ్యాన్స్ తెగ సంతోషపడిపోయారు. ఇప్పుడు ఏకంగా వీరి పెళ్లి పత్రిక వైరల్ అవుతుంది.ఆతర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ జరగనుందని తెలుస్తుంది.
Read hindi news: hindi.vaartha.com

