Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ సర్కార్కు వణక్కం

విజయ్ సర్కార్కు వణక్కం

వార్త 1 week ago

Vijay Sarkar: తమిళనాడు శాసనసభలో మొట్టమొదటిసారిగా ద్రవిడే తర పార్టీ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో గెలుపొందింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తమిళ వెట్రికళగం పార్టీ (టి.వి.కె) అధ్యక్షుడు సి.

జోసెఫ్ విజయ్ ఎంతో అవలీ లగా విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. బలపరీక్షలో విజయ్కు అనుకూలంగా 144 మంది సభ్యులు తమ అభి ప్రాయాన్ని వ్యక్తంచేయగా వ్యతిరేకంగా 22 మంది ఓట్లేసారు. 61 మంది ఎమ్మెల్యేలు విజయ్ బలపరీక్షను నిరసిస్తూ సభను వాకౌట్ చేశారు. ఐదుగురు సభ్యులు గైర్హాజరయ్యారు. బలపరీక్షకు ముందు ముఖ్యమంత్రి విజయ్ మాట్లా డుతూ తాము సెక్యులర్ పాలనను అందిస్తామని, జన సర్కార్ను ఏర్పాటు చేసేందుకు ప్రజలు అవకాశం కల్పిం చారని విపక్షాలు ఆరోపించినట్లు విశ్వాస పరీక్ష నెగ్గేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో ఎలాంటి బేరసారాలు చేయ లేదని విజయ్ స్పష్టం చేశారు. అందరూ మెచ్చే పాలనలో గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమపథకాలు కొనసాగిస్తామని ప్రకటించారు.

Read Also: Tamil Nadu: అన్ని ప్రార్థనా స్థలాల్లో ఒకే దివ్యమైన అనుభూతి.. విజయ్ పాత ఇంటర్వ్యూ

 Vijay Sarkar

Vijay Sarkar: ఎమ్మెల్యేలకు ‘ఎరవేసి

సభలో విపక్ష డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ ప్రజమోదం పొందడంలో టి.వికె విఫలమైందని, తమ కూటమిలోని పార్టీలే విజయ్కు మద్దతు నిస్తున్నాయని ఎమ్మెల్యేల బేరసారాలకు తెరతీసిందని విమర్శించారు. అటుపై డిఎంకె సభ్యులంతా వాకౌట్ చేశారు. ఆల్ ఇండియా అన్నాడిఎంకె పళనిస్వామి కూడా తమ ఎమ్మెల్యేలకు ‘ఎరవేసి తమ వైపునకు తప్పుకున్నారని ఆరోపించారు. సాధారణంగా విశ్వాస పరీక్ష సందర్భంగా జరుగుతున్న వ్యవహారశైలిని పార్టీలు తమ ఉపన్యాసంలో అధికార పక్షాన్ని ఎండకట్టడం సహజం. బేధాభిప్రాయాలు సహజంగా ఉండే రాజకీయ పార్టీలలో బేరసారాలతో చీలిక తీసుకురావడం తగదని టివికెకి హితవు చెప్పడం విశేషం. ఎవరికి అవకాశం వస్తే వారు తమ అవసరాల మేరకు ప్రభుత్వంపై పట్టుసాధించాల్సి వచ్చినప్పుడు టక్కుటమార గోకర్ణ విద్యలతో ప్రభావితం చేయడం తమిళ రాజకీయా ల్లో సర్వసాధారణంగా జరిగేదే.

ముందుంది ముసళ్ల పండుగ

కానీ ఈసారి ఓటమి ద్రవిడ రాజకీయ పార్టీలది అవడంలో హితోపదేశాలతో సరిపుచ్చారు. గతంలో జయలలిత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను స్టాలిన్ కొనసాగించినట్లుగానే డిఎంకె ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉనికిలో ఉంటాయని విజయ్ ప్రకటించడం ఆహ్వానించదగిన అంశం. ఏదిఏమైనా బలపరీక్ష సందర్భంగా ఎదుర్కొన్న ఆరోపణలు, సంక్షోభ సమయంలో ఇబ్బందులు, వివిధ పార్టీల ప్రవర్తన, వారి ఆకాంక్షలు నిలబెట్టుకోవాలన్న ప్రయత్నం…. ఇవన్నీ చూసి ‘ఇళ్లలకంగానే పండుగ కాదు ముందుంది ముసళ్ల పండుగ అన్నది కొత్త ముఖ్యమంత్రికి తెలిసొచ్చినట్లుంది. తమిళ నాడు శాసనసభలో మొత్తం సీట్లు 234 కాగా బలపరీక్ష సమయంలో డిఎంకె, అన్నాడిఎంకె పళని స్వామి వర్గం ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. పిఎంకె సభ్యులు గైర్హాజరైన వారిలో ఉన్నారు. బలపరీక్షలో విజయ్ గెలిచినట్లు స్పీకర్ జెసిడి ప్రభాకర్ ప్రకటించారు. ఈ పరీక్షలో ఎమ్మెల్యేలు తమ సీట్లోనే నిలబడి తాము విజయ్కు మద్దతునిస్తున్నట్లు తెలిపారు. విజయ్ నేతృత్వంలోని 10సీట్లకు ముందే ఆగి పోవడంతో నాలుగు సార్లు గవర్నర్ను కలిస్తే తప్ప విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు ఏలిన వారి దయ కలుగలేదు.

 Vijay Sarkar

అనుకోని విజయాలు విజయ్ చెంత

అంకెల ప్రమాణంతో విజయ్న తొలుత ఆ రాష్ట్ర గవర్నర్ పదేపదే తిప్పించుకున్నారన్న అపప్రథ పొందారు. సంపూర్ణ మద్దతుతోనే స్వచ్ఛమైన పాలనను అందించే ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాలనే భావనతోనే ఆయ నలా వ్యవహరించారన్నవిశ్లేషణలు మొదలయ్యాయి. ఏమై తేనేం ఇక విజయ్క ఇప్పుడు అడ్డూఅదుపు లేదు. ప్రభు త్వాధినేతగా ఆయన తొలి సంతకాలు పెట్టిన నిర్ణయాలను బట్టి విజయ్పా లనపై కొన్ని అంచనాలు మొదలయ్యాయి. తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీ నిరూపణలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తనకున్న 107 సీట్లతో పాటు విసికె, ఐయుఎంఎల్ వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలతో కేవలం 120మంది మద్దతును కూడగట్టారు. తీరా అసెంబ్లీ లో గెలుపుసాధించిన తర్వాత అనుకూల, వ్యతిరేక వర్గాల ఓట్లు గణిస్తే మేజిక్ ఫిగరు, విజయ్ చూపిన మద్దతుదారుల సంఖ్యనుదాటి మొత్తం అనుకూల ఓట్లు 144కి చేరాయి. అయినా అనుకోని విజయాలు విజయ్ చెంత చేరాయి.

దుకాణాలు మూసివేతకు విజయ్ ఆదేశాలు

అంతకు ముందే అనూహ్యంగా అన్నా డిఎంకెలో వేరు పడిన సీనియర్ నేతలు ఎస్.పి వేలుమణి, సి.వి షణ్ముగం వర్గం తాము వేరుగా విపన్నునియమించుకుంటామని కోరగా స్పీకరు అంగీకరించడంతో అసెంబ్లీలో అధికార పార్టీ ఎత్తుగడల మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. చీలిక వర్గ స్థాయిని, హోదాని ప్రకటించకుండా ‘విప్’ నియామకానికి అనుమతినీయడం విమర్శలకు గురైంది. పనిలో పనిగా ప్రభుత్వం తొలి అడుగులు తప్పటడుగుతో మొదలెట్టిందనే యోచనలో ఎండిఎంకె అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ప్రేమలతా విజయకాంతముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వ పొలిటికల్ అడ్వైజర్గా ఒక జ్యోతిష పండితుడు రాధా పండిట్ను నియామకం యూత్కు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నా యో ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలని ఎదురుదాడి చేశా రు. బేషరతుగా మద్దతునిచ్చినట్లు చెప్పుకున్న విదుతలై, చిరుతైగల్కట్టి (విసికె)కి ఐదుగురు ఎమ్మెల్యేలున్నారు. సభలో ఈపార్టీ ఎమ్మెల్యే వన్నివరసు ప్రసంగంలో సమా జంలో శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచాలని, హతువాద ఆలోచనలను ప్రోత్సహించాలని జ్యోతిష్యం వంటి మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా కఠిన చట్టం తీసుకురావాలనీ కోరారు. ఆనక విజయ్ రాధా పండిట్ నియమాకాన్ని పక్కన పెట్టారు. బహిరంగంగా వారి సూచనలు. ఇవన్నీ వింటుంటే జనానికి దడ పుట్టించక మానవు. తమిళనాట ఆలయాలు, విద్యాలయాల వద్ద ఉండే 717దుకాణాలు మూసివేతకు విజయ్ ఆదేశాలిచ్చారంటే ఆయన పాలన ఎలా ఉంటుందో రుచి చూపించారని అనుకోవాలి. ఈ ఐదేళ్లపాటు ద్రవిడేతర రాజకీయ పార్టీని ద్రవిడ పార్టీలు ఎంత బేషుగ్గా పాలించనిస్తాయో చూడాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

నీట్ రద్దు చేయండి.. 12వ తరగతి మార్కులే ప్రామాణికం కావాలి: సీఎం విజయ్ డిమాండ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha