CM Vijay Team: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే..
అయితే ఈ విజయ ప్రస్థానంలో విజయ్ వెనుక ఉండి నడిపించిన వారు, ఆయన క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న తెలుగు వ్యక్తుల గురించి ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముఖ్యంగా విష్ణువర్ధన్ రెడ్డి, మంత్రి కీర్తనల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Read Also:Cooking Oil : వంట నూనె తగ్గించాలని మోడీ పిలుపు !!
ఎవరీ విష్ణువర్ధన్ రెడ్డి? విజయ్‌కు అంత సన్నిహితుడా?
విజయ్ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్‌ను కలిసిన సమయంలో ఆయన వెంటే ఉన్న ఎర్రదొడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు.ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా కలికిరి మండలం ఎర్రదొడ్డిపల్లె ఈయన స్వస్థలం. గత 15 ఏళ్లుగా చెన్నైలో స్థిరపడి గ్రానైట్ వ్యాపారం చేస్తున్నారు.గత పదేళ్లుగా విజయ్‌కు అత్యంత నమ్మకస్తుడు, సన్నిహితుడిగా పేరుగాంచారు. టీవీకే పార్టీ స్థాపన నుంచి వ్యూహరచన వరకు విష్ణు రెడ్డి పాత్ర ఎంతో ఉందని సమాచారం.
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి బంధువు!
విష్ణువర్ధన్ రెడ్డికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఈయన తండ్రి రామనారాయణ రెడ్డి గతంలో వైస్ ఎంపీపీగా పనిచేశారు. విశేషమేమిటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి విష్ణు రెడ్డి సమీప బంధువు. కిరణ్ కుమార్ రెడ్డి సోదరిని విష్ణు రెడ్డి కుటుంబ సభ్యులకే ఇచ్చి వివాహం చేయడంతో, విష్ణు రెడ్డి ఆయనకు వరుసకు బావమరిది అవుతారు.
మంత్రివర్గంలో తెలుగు తేజం: శివకాశి ఎమ్మెల్యే కీర్తన
విజయ్ తన మంత్రివర్గంలో యువతకు, మహిళలకు పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా శివకాశి నియోజకవర్గం నుంచి గెలిచిన ఎస్. కీర్తన (29) కు మంత్రి పదవి దక్కింది.కీర్తనకు తెలుగు మూలాలు ఉండటం, ఆమె అనర్గళంగా తెలుగు మాట్లాడగలగడం వల్ల తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమె గురించి చర్చ జరుగుతోంది.29 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు చేపట్టి, విజయ్ క్యాబినెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. గతంలో ఆమె పీకే (ప్రశాంత్ కిశోర్) టీమ్‌లో పనిచేసిన అనుభవం ఉండటం విశేషం.
CM Vijay Team: తమిళ రాజకీయాల్లో తెలుగు ప్రభావం
తమిళనాడులో గణనీయంగా ఉన్న తెలుగు ఓటర్లను ఆకట్టుకోవడంలో, పార్టీ వ్యూహాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో ఈ తెలుగు వ్యక్తులు కీలక పాత్ర పోషించారు. విజయ్ గవర్నర్‌ను కలిసిన ఫోటోలో విష్ణు రెడ్డి ఉండటం ఆయన ప్రాధాన్యతను చాటిచెబుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
బెంగాల్ మహిళలకు వరం: జూన్ 1 నుంచి ఉచిత బస్సు ప్రయాణం

