Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం: కుక్క నోట మనిషి కాలు.. ఏం జరిగింది?

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం: కుక్క నోట మనిషి కాలు.. ఏం జరిగింది?

వార్త 1 week ago

Medical Negligence GGH : విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకున్న ఒక భయంకర ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆసుపత్రి సిబ్బంది మరియు భద్రతా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా, ఒక రోగికి ఆపరేషన్ చేసి తొలగించిన కాలును కుక్క నోట కరుచుకువెళ్లడం సంచలనం సృష్టించింది.

ఈ ఘటన ఆసుపత్రిలోని పారిశుద్ధ్య మరియు భద్రతా ప్రమాణాలను ప్రశ్నిస్తోంది.

వ్యర్థాల గదిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం

ఒక రోగికి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ సోకడంతో వైద్యులు ఆపరేషన్ చేసి కాలును తొలగించారు. నిబంధనల ప్రకారం దానిని బయో-వేస్ట్ కింద తరలించాల్సి ఉండగా, సిబ్బంది ఒక సంచిలో పెట్టి మొదటి అంతస్తులోని వ్యర్థాల గదిలో ఉంచారు. అయితే, ఆ గది తలుపులు సరిగా మూసివేయకపోవడంతో, ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించిన ఒక కుక్క నేరుగా లోపలికి వెళ్లి ఆ కాలి సంచిని నోట కరుచుకుని బయటకు పరుగు తీసింది.

Read Also: Petrol Price Hike: ఎన్నికలు అవ్వగానే పెట్రోల్ బాదుడు.. కేంద్రంపై ఎమ్మెల్యే యెన్నం ఫైర్!

 Medical Negligence GGH

భద్రతా వైఫల్యంపై వెల్లువెత్తుతున్న విమర్శలు

ఆసుపత్రి బయట కొంత దూరంలో కుక్క ఆ కాలిని పీక్కుని తింటుండగా గమనించిన వారు భీతిల్లారు. బయో-వేస్ట్ తరలింపు వాహనం మూడు రోజులకు ఒకసారి వస్తుందని, అంతవరకు శరీర భాగాలను భద్రపరచడంలో సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. విషయం వెలుగులోకి రావడంతో ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తమై, కుక్కను వెంబడించి ఆ కాలి భాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ అమానవీయ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కేసీఆర్‌పై కవిత సంచలన ఆరోపణలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha