Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్‌కు హీరోయిన్ శ్రియ మద్దతు

విజయ్‌కు హీరోయిన్ శ్రియ మద్దతు

వార్త 3 months ago

Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 108 సీట్లు గెలుచుకుని సత్తా చాటిన టీవీకే (TVK) అధినేత విజయ్‌కు సినీ పరిశ్రమ నుండి భారీగా మద్దతు లభిస్తోంది.

మెజారిటీ సాధించినా విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంపై ప్రముఖ తారలు స్పందిస్తున్నారు.

Read Also :TVK ఎమ్మెల్యేలంతా రాజీనామాకు సిద్దపడ్డారా ?

ప్రజా తీర్పును అవమానించడమే: కమల్ హాసన్

లోకనాయకుడు కమల్ హాసన్ ఇప్పటికే విజయ్‌కు మద్దతుగా నిలిచారు. “టీవీకే 108 సీట్లు గెలుచుకుంది. వారికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని నిరాకరించడం అంటే తమిళనాడు ప్రజల తీర్పును అవమానించడమే” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

కమల్ పోస్ట్‌ను రీపోస్ట్ చేసిన శ్రియ

తాజాగా హీరోయిన్ శ్రియ శరన్ కూడా విజయ్‌కు అండగా నిలిచారు. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రీపోస్ట్ చేస్తూ గవర్నర్ తీరును వ్యతిరేకించారు. ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పును గౌరవించాలని, విజయ్‌కు అవకాశం ఇవ్వాలని ఆమె పరోక్షంగా డిమాండ్ చేశారు. ప్రజల మద్దతుతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా వరుసగా విజయ్‌కు మద్దతు తెలుపుతుండటంతో టీవీకే శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మరి ఈ ఒత్తిడి నేపథ్యంలో గవర్నర్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

చెన్నైలో టీవీకే కార్యకర్తల గర్జన.. లోక్‌భవన్ ముందు ఉద్రిక్తత!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha