Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్‌ను PM కుర్చీలో రాహుల్ కూర్చోబెడతారు : TVK ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

విజయ్‌ను PM కుర్చీలో రాహుల్ కూర్చోబెడతారు : TVK ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

వార్త 2 weeks ago

Vijay : తమిళనాడు రాజకీయాల్లో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, ముఖ్యమంత్రి విజయ్ (Vijay) జాతీయ రాజకీయ ప్రవేశంపై చర్చ తీవ్రమైంది. 2029 సార్వత్రిక ఎన్నికల్లో విజయ్ దేశ ప్రధాని పీఠం అధిష్టించడం ఖాయమని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే స్వయంగా ఆయన్ను ఆ కుర్చీలో కూర్చోబెడతారని టీవీకే ఎమ్మెల్యే కన్మొజి సంతొష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

రేపటి ప్రధాని విజయ్ :

ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వెలువడిన ‘రేపటి ప్రధాని విజయ్’ పోస్టర్లు, అలాగే జాతీయ స్థాయిలో వస్తున్న సర్వేల నేపథ్యంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. గతంలో రాహుల్ గాంధీ మద్దతుతోనే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారని, అదే రీతిలో 2029లో రాహుల్ స్వయంగా విజయ్ చేయి పట్టుకుని ప్రధాని కుర్చీలో కూర్చునేలా చేస్తారని టీవీకే ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.

 CM Vijay

అయితే, ఈ వ్యాఖ్యలపై మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. 2029 ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి తరఫున రాహుల్ గాంధీ మాత్రమే ప్రధాని అభ్యర్థి అని, దీనికి విరుద్ధంగా విజయ్‌ను ప్రధానిగా ప్రొజెక్ట్ చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ హెచ్చరించింది. ఒకవేళ టీవీకే పార్టీ రాహుల్ మద్దతును ప్రకటించకపోతే, తమ మంత్రులు మంత్రివర్గం నుంచి తప్పుకుంటామని కాంగ్రెస్ అల్టిమేటం జారీ చేసింది.

రాష్ట్రంలో విజయ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పటికీ, జాతీయ నాయకత్వం విషయంలో మిత్రపక్షాల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha