Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్‌పై మూడు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు!

విజయ్‌పై మూడు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు!

వార్త 2 months ago

Vijay: తమిళనాడు ఎన్నికల వేళ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేగింది. తమిళ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్‌పై చెన్నై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ఏకంగా మూడు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Read Also:Lashkar-e-Taiba: పాక్ లో తగ్గుతున్న భారత్ మోస్ట్-వాంటెడ్ ఉగ్రవాదుల సంఖ్య

 Cases filed against TVK Vijay Chennai

Vijay: ఎందుకు కేసులు నమోదు చేశారు?

వెప్పేరి పోలీసు స్టేషన్: వెప్పేరి ప్రాంతంలో కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం నిర్వహించారంటూ ఇక్కడ కూడా విజయ్‌పై కేసు పెట్టారు.మాంబళం పోలీసు స్టేషన్: టి.నగర్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అనుమతించిన సమయం, నిబంధనలను అతిక్రమించారని ఎన్నికల అధికారి సంతోష్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వ అధికారుల ఉత్తర్వుల ఉల్లంఘన సహా రెండు సెక్షన్ల కింద విజయ్, టీవీకే అభ్యర్థి ఆనంద్‌తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.నుంగంబాక్కం పోలీసు స్టేషన్: వళ్లువర్‌కోట్టం వద్ద భారీ రోడ్ షో నిర్వహించడం వల్ల సాధారణ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందనే ఫిర్యాదుతో ఇక్కడ మరో కేసు నమోదైంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

విజయవాడ మీదుగా సమ్మర్ స్పెషల్ రైళ్లు.. ఆ రూట్ల వివరాలు ఇవే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha