Dailyhunt
విజువల్ వండర్‌గా 'రామాయణం': రాముడిగా రణ్‌బీర్ అదుర్స్..

విజువల్ వండర్‌గా 'రామాయణం': రాముడిగా రణ్‌బీర్ అదుర్స్..

వార్త 0 months ago

Ramayana movie Glimpse Release: బాలీవుడ్ వెండితెరపై అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇతిహాసం 'రామాయణం' ఆవిష్కృతం కాబోతోంది. నితీష్ తివారి దర్శకత్వంలో విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైన గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

Read Also:Nayan Sarika : వరుస హిట్లతో దూసుకెళ్తున్న హీరోయిన్

Ramayana movie Glimpse Release: అబ్బురపరిచే విజువల్స్ (VFX)

హాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందిన డీఎన్‌ఈజీ (DNEG) సంస్థ ఈ సినిమాకు గ్రాఫిక్స్ అందించింది. "అవర్ ట్రూత్.. అవర్ హిస్టరీ" (మన సత్యం.. మన చరిత్ర) అంటూ విడుదల చేసిన గ్లింప్స్‌లో వీఎఫ్ఎక్స్ వర్క్ హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. విజువల్స్ చూస్తుంటే దర్శకుడు నితీష్ తివారి ఈ ఇతిహాసాన్ని వెండితెరపై ఒక అద్భుతంలా మలచబోతున్నారని స్పష్టమవుతోంది.

ఈ గ్లింప్స్‌లో రణబీర్ కపూర్ రాముడిగా ఎంతో గంభీరంగా, శాంత స్వభావంతో కనిపిస్తున్నారు. సంప్రదాయ వేషధారణలో ఆయన లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఆయన ముఖంలో కనిపించిన ప్రశాంతత, ధైర్యం, దైవత్వం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చిత్రంలో సీతగా సాయి పల్లవి నటిస్తుండగా, రావణుడిగా యశ్ కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. విజువల్స్, గ్రాఫిక్స్, నిర్మాణ విలువలు అంతర్జాతీయ స్థాయిలో ఉండనున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మొదటి భాగాన్ని 2026 దీపావళి సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంతో భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని ప్రపంచ స్థాయిలో కొత్తగా పరిచయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. దాదాపు ఈ చిత్రానికి 4వేల కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం. తాజా గ్లింప్స్ విడుదలతో 'రామాయణం'పై ఉన్న ఆసక్తి మరింత పెరిగింది. రాబోయే రోజుల్లో టీజర్, ట్రైలర్ విడుదల చేసి ఈ చిత్రంపై మరింత హైప్ సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ప్రభాస్ సినిమా మళ్లీ థియేటర్లలో

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha