Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వికారాబాద్ జిల్లాలో విషాదం.. మైనింగ్ గుంతలో పడి ఇద్దరు మృతి

వికారాబాద్ జిల్లాలో విషాదం.. మైనింగ్ గుంతలో పడి ఇద్దరు మృతి

వార్త 3 weeks ago

Vikarabad Tragedy: వికారాబాద్ జిల్లా ధారూరు మండలంలో దారుణమైన విషాద సంఘటన చోటుచేసుకుంది. సుద్ద (సున్నపురాయి/చాక్) మైనింగ్ గుంతలో నీట మునిగి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనతో తరిగోపుల గ్రామంలో ఒక్కసారిగా శోకసంద్రం అలుముకుంది.

Read Also : Vadarevu fishermen missing : బాపట్ల జిల్లాలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ఐదుగురు మత్స్యకారులు గల్లంతు!

 Tragedy in Vikarabad district: Two die after falling into a mining pit

Vikarabad Tragedy: ఒకరిని కాపాడబోయి మరొకరు..

వివరాల ప్రకారం.. తరిగోపుల గ్రామానికి చెందిన అశోక్, శ్రీనివాస్ అనే ఇద్దరు యువకులు మేకలు మేపేందుకు తరిగోపుల-జైదుపల్లి గ్రామాల మధ్య ఉన్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ మేకలు, గొర్రెలను కడిగేందుకు సమీపంలో ఉన్న సుద్ద మైనింగ్ గుంత వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో అశోక్ గొర్రెను కడిగేందుకు నీటిలోకి దిగగా ప్రమాదవశాత్తు లోతైన నీటిలో జారిపడిపోయాడు.

అశోక్ నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించిన స్నేహితుడు శ్రీనివాస్, అతడిని కాపాడాలనే ఉద్దేశంతో వెంటనే నీటిలోకి దూకాడు. అయితే గుంత లోతు ఎక్కువగా ఉండటంతో పాటు ఊబిలా మారిన నీటి సందుల వల్ల ఇద్దరూ బయటకు రాలేక నీట మునిగి ప్రాణాలు విడిచారు.

గ్రామంలో శోకసంద్రం.. కేసు నమోదు చేసిన పోలీసులు

సంఘటన గురించి సమాచారం అందుకున్న గ్రామస్తులు వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ధారూరు పోలీసులు గ్రామస్తుల సాయంతో మృతదేహాలను నీటి గుంత నుంచి వెలికితీశారు.

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఇలా ప్రమాదవశాత్తు అకాల మరణం చెందడంతో తరిగోపుల గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మహబూబాబాద్‌ బైపాస్ పై అనుమానాస్పద అవయవాలు.. పోలీసుల ఆరా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha