Dhruva Natchathiram Release Update: చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న విక్రమ్(Vikram) సినిమా "ధృవ నక్షత్రం" విడుదలకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం నుండి ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 'ధృవ నక్షత్రం' చిత్రాన్ని మే 22న విడుదల చేసేందుకు మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
Is the line clear for the release of Vikram’s ‘Dhruva Nakshatra’ movie?
Dhruva Natchathiram Release Update: వివాదాలకు ముగింపు
గత ఎనిమిదేళ్లుగా ఆర్థిక,న్యాయపరమైన ఇబ్బందుల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇటీవలే మద్రాస్ హైకోర్టులో న్యాయ వివాదాలు ముగియడంతో ఈ వివాదాలన్నీ సర్దుమణిగాయని మే 22 విడుదలకు లైన్ క్లియర్ అయిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. విక్రమ్ ఈ సినిమాలో స్టైలిష్ స్పై ఏజెంట్‌గా కనిపిస్తుండగా హారిస్ జయరాజ్ సంగీతం సినిమాపై అంచనాలను పెంచింది. "ఈ సినిమాలో విక్రమ్‌తో పాటు వినాయకన్, రితు వర్మ, పార్థిబన్, సిమ్రన్, రాధికా సరత్‌కుమార్ వంటి నటులు ఉన్నారు. ఈ సినిమాకు పలువురు సినిమాటోగ్రాఫర్లు పనిచేయగా, ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

