Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వీల్‌చైర్ లో నీరజ్.. ఫ్యాన్స్ ఆందోళన

వీల్‌చైర్ లో నీరజ్.. ఫ్యాన్స్ ఆందోళన

వార్త 3 weeks ago

Neeraj Chopra : భారత స్టార్ అథ్లెట్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా ఢిల్లీ విమానాశ్రయంలో వీల్‌చైర్‌లో కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ప్రాక్టీస్ సమయంలో ఆయన మడమ భాగంలో లిగమెంట్ తీవ్రంగా దెబ్బతినడంతో నడవడానికి ఇబ్బంది పడుతున్న దృశ్యాలు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమ అభిమాన ఛాంపియన్ ప్లేయర్ నడవలేని స్థితిలో వీల్‌చైర్‌కు పరిమితమవ్వడం చూసి క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.

ఏషియన్ గేమ్స్‌కు దూరం: ఇన్స్టాగ్రామ్‌లో నీరజ్ భావోద్వేగ పోస్ట్

రాబోయే ఏషియన్ గేమ్స్‌తో పాటు ఈ సీజన్‌లోని మిగిలిన అన్ని టోర్నమెంట్లకు దూరమవుతున్నట్లు నీరజ్ చోప్రా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు. వైద్యులు మరియు ఫిజియో టీమ్‌తో సుదీర్ఘంగా చర్చించిన అనంతరమే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రీసెంట్‌గా ఫామ్‌లోకి వస్తున్న సమయంలో ఈ గాయం కావడం నిరాశ పరిచినప్పటికీ, మరింత దృఢంగా పునరాగమనం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాగా, పతకాలు తెచ్చిపెట్టే స్టార్ ప్లేయర్ ఆసియా క్రీడలకు దూరం కావడం భారత క్రీడా రంగానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

క్రీడల్లో వసతి సంక్షోభం.. సొంత ఏర్పాట్లు చేసుకోవాలన్న నిర్వాహకులు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha