Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విమాన టికెట్ల ధరల నియంత్రణపై కేంద్రం ఫోకస్‌

విమాన టికెట్ల ధరల నియంత్రణపై కేంద్రం ఫోకస్‌

వార్త 1 week ago

Air Fare Rules: ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థలు ఇష్టానుసారంగా విమాన టికెట్ ధరలను పెంచుతూ ప్రయాణికులను దోచుకుంటున్న వైనానికి త్వరలోనే అడ్డుకట్ట పడనుంది.

ఈ మేరకు విమానయాన ఛార్జీల నియంత్రణకు సంబంధించి సరికొత్త నిబంధనలను రూపొందించే ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది.

రెండు వారాల్లో అధికారిక నోటిఫికేషన్: సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడి

ఎస్. లక్ష్మీనారాయణన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ కీలక విషయాన్ని కోర్టుకు వెల్లడించారు. పండుగ రద్దీ సమయాల్లో ప్రైవేట్ విమానయాన సంస్థలు విపరీతంగా ధరలు పెంచడంపై పిటిషనర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం, రెండు వారాల్లోగా ఈ నిబంధనలకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని స్పష్టం చేసింది.

Air Fare Rules: నవంబర్ 16 నాటికి నిబంధనల కాపీ సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశం

కేంద్ర ప్రభుత్వ వాదనలను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే నవంబర్ 16 నాటికి కొత్త విమానయాన నిబంధనలకు సంబంధించిన పూర్తి కాపీని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే పండగ వేళల్లో విమాన ప్రయాణికులకు విపరీతమైన ధరల మోత నుంచి భారీ ఊరట లభించే అవకాశం ఉంది.

Epaper: epaper.vaartha.com

దేశంపై పరాయివాళ్ల పెత్తనం సహించం.. ఒవైసీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha