Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు!

విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు!

వార్త 2 months ago

Virat Kohli Record: ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అద్భుత మైలురాయిని అధిగమించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.

బెంగళూరులోని(RCB) చిన్నస్వామి స్టేడియం వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో కోహ్లీ కేవలం 15 పరుగులు పూర్తి చేయగానే, ఐపీఎల్ చరిత్రలో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్‌పై శిఖర్ ధావన్ పేరిట ఉన్న రికార్డును తిరగరాస్తూ, సీఎస్‌కేపై 1,174 పరుగులతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ అరుదైన ఘనత సాధించిన క్రమంలో స్టేడియం మొత్తం ‘కోహ్లీ.. కోహ్లీ..’ నినాదాలతో దద్దరిల్లిపోయింది.

ఈ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఆరంభం నుంచే ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి దూకుడును అందించే క్రమంలో 18 బంతుల్లో 28 పరుగులు సాధించాడు. ఇందులో రెండు ఫోర్లు మరియు ఒక అద్భుతమైన సిక్సర్ ఉన్నాయి. ముఖ్యంగా పవర్‌ప్లేలో చెన్నై పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే, భారీ స్కోరు దిశగా సాగుతున్న తరుణంలో అన్షుల్ కాంబోజ్ వేసిన స్లో డెలివరీని సరిగ్గా అంచనా వేయలేక క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కోహ్లీ తన ఇన్నింగ్స్‌ను సెంచరీగా మలచలేకపోయినప్పటికీ, తన ఫేవరెట్ ప్రత్యర్థిపై చారిత్రాత్మక రికార్డును నెలకొల్పి అభిమానులను ఖుషీ చేశాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

బెంగళూరు (RCB).. 14.1 ఓవర్లలో 151/3

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha