Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై కపిల్ దేవ్ అసంతృప్తి

విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై కపిల్ దేవ్ అసంతృప్తి

వార్త 3 weeks ago

Virat Kohli Test Retirement: భారత క్రికెట్ రారాజు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంపై టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

విరాట్ కోహ్లీ అత్యంత తొందరపాటుతో టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడని, బహుశా తీవ్ర అసహనం లేదా క్షణిక ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 1983 ప్రపంచకప్ హీరో చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో విరాట్ రిటైర్మెంట్ అంశాన్ని మరోసారి హాట్ టాపిక్‌గా మార్చాయి.

read also: India vs England 2nd T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

మరికొంత కాలం వేచి చూడాల్సింది.. కపిల్ ఆవేదన

గత ఏడాది (2025 మే 12న) విరాట్ కోహ్లీ అంచనాలను తలకిందులు చేస్తూ హఠాత్తుగా టెస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కపిల్ దేవ్ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. “విరాట్ టెస్ట్ క్రికెట్‌ను వీడటం నాకు ఎంతమాత్రం నచ్చలేదు. ఆ సమయంలో తనలో ఉన్న ఒత్తిడిని, నిరాశను అధిగమించేందుకు అతడు కొంత సమయం తీసుకుని ఉంటే బాగుండేది. కోహ్లీలో ఇంకా దేశానికి సేవ చేసే సత్తా చాలానే ఉంది, కానీ సమయం కాని సమయంలో అర్ధాంతరంగా వైదొలిగాడు” అని కపిల్ దేవ్ పేర్కొన్నారు.

Virat Kohli Test Retirement: గణాంకాలు ఘనం.. దూకుడే కొంపముంచిందా?

తన 14 సంవత్సరాల అద్భుతమైన టెస్ట్ కెరీర్‌లో కోహ్లీ మొత్తం 123 మ్యాచ్‌లు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు భారీ స్కోరు సాధించాడు. ముఖ్యంగా విదేశీ పిచ్‌లపై భారత్‌ను తిరుగులేని శక్తుగా మార్చడంలో విరాట్ కెప్టెన్సీ, బ్యాటింగ్ కీలక పాత్ర పోషించాయి. అయితే బోర్డర్-గవాస్కర్ సిరీస్ సమయంలో ఫామ్ కోల్పోవడం, ఆపై భావోద్వేగంతో సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విరాట్‌లోని దూకుడు స్వభావాన్ని టెన్నిస్ స్టార్ జాన్ మెకెన్రోతో పోల్చిన కపిల్, అదే శైలి అతడిని ఇంత త్వరగా రిటైర్ అయ్యేలా ప్రేరేపించి ఉండవచ్చని విశ్లేషించారు.

Epaper: epaper.vaartha.com

నేడే రెండో టీ20.. భారత్ బోణీ కొట్టేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha