Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విరిగిన ఎముకలను అతికించే అద్భుత ఔషధం.. ఉపయోగాలు ఇవే!

విరిగిన ఎముకలను అతికించే అద్భుత ఔషధం.. ఉపయోగాలు ఇవే!

వార్త 3 weeks ago

Nalleru Plant Benefits: ప్రకృతిలో లభించే అనేక మొక్కలు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వాటిలో నల్లేరు ఒకటి. దీనిని సంస్కృతంలో 'వజ్రవల్లి' లేదా 'అస్థి సంహార' అని పిలుస్తారు.

ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది అద్భుతంగా పనిచేస్తుందని, అందుకే దీనికి ఆ పేరు వచ్చిందని ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు. పొడవాటి కాడలు, కణుపులతో ఉండే ఈ మొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి ప్రహరీల వద్ద విరివిగా కనిపిస్తుంది.

Read also: Snacks : ఏ స్నాక్స్‌ తింటే ఎంత దూరం వాకింగ్ చేయాలో తెలుసా..

ఎముకల ఆరోగ్యానికి మేలు

నల్లేరులో కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి.

  • ఎముకలు అతుక్కోవడానికి: ప్రమాదవశాత్తూ ఎముకలు విరిగినప్పుడు, నల్లేరును పొడి రూపంలో గానీ లేదా ఆహారంలో భాగంగా గానీ తీసుకుంటే ఎముకలు త్వరగా అతుక్కునేలా చేస్తుంది.
  • కీళ్ల నొప్పులు: దీర్ఘకాలికంగా వేధించే నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నుండి ఇది తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది.

Nalleru Plant Benefits: శ్వాసకోశ సమస్యలకు చెక్

మారుతున్న వాతావరణం కారణంగా వచ్చే శ్వాసకోశ ఇబ్బందులకు నల్లేరు ఒక ఉత్తమ ఔషధం.

  • దగ్గు, కఫం: దీర్ఘకాలిక దగ్గుతో బాధపడేవారు, కఫం పేరుకుపోయిన వారు నల్లేరును వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఆహారంలో భాగంగా..

నల్లేరు కేవలం మందుగానే కాకుండా, రుచికరమైన ఆహారంగా కూడా తీసుకోవచ్చు. దీని లేత కాడలు, ఆకులతో చేసే నల్లేరు పచ్చడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. అయితే, దీనిని శుభ్రం చేసేటప్పుడు చేతులకు కొద్దిగా నూనె రాసుకోవడం మంచిది, లేదంటే కాడల వల్ల దురద వచ్చే అవకాశం ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha