Revanth Reddy:హెచ్-1బీ వీసా నిబంధనలను మరింత సులభతరం చేయాలని, అమెరికాలో ఉన్నత విద్యను పూర్తి చేయాలనుకునే తెలంగాణ విద్యార్థుల కోసం వీసా స్లాట్ల సంఖ్యను పెంచాలని ముఖ్యమంత్రి ఎ.
రేవంత్ రెడ్డి అమెరికా ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. బుధవారం నూతనఢిల్లీలో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.

విద్యార్థుల భద్రత మరియు వీసా ప్రక్రియ వేగవంతం
ప్రతి సంవత్సరం అమెరికా బాట పట్టే తెలంగాణ విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతున్నందున, వారికి తక్షణమే వీసా అపాయింట్‌మెంట్లు దక్కేలా దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అక్కడ విద్యనభ్యసిస్తున్న మన విద్యార్థుల సంక్షేమం, భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. అలాగే, హెచ్-1బీ నిబంధనలలో ఎలాంటి మార్పులు చేసినా ముందస్తు సమాచారం ఇవ్వాలని, దీనివల్ల అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణ నిపుణుల ప్రయోజనాలకు రక్షణ ఉంటుందని ఆయన సూచించారు.
Revanth Reddy: రాష్ట్రంలో పెట్టుబడులకు అమెరికా కంపెనీల ఆహ్వానం
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపారమైన అవకాశాలను రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో వివరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్, మరియు స్టార్టప్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ కార్పొరేట్ కంపెనీలను ఆయన ఆహ్వానించారు. హైదరాబాద్ నగరంలో తమ గ్లోబల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా, అమెరికాలోని పేరొందిన విశ్వవిద్యాలయాలు మన రాష్ట్రంలోని విద్యా సంస్థలతో కలిసి ఉమ్మడి పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేలా ప్రోత్సహించాలని విన్నవించారు.
ఇంటర్ కాలేజీల ఫోర్జరీ కేసులో సంచలనం.. ఫైర్ డీజీ సంతకాలు కూడా నకిలీ

