Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విషాదం.. బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి

విషాదం.. బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి

వార్త 2 weeks ago

Telangana man dies in Bahrain:బహ్రెయిన్‌లో తెలంగాణ వాసి మృతి చెందడం స్థానికంగా విషాదం నింపింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన తోట శ్రీనివాస్ పని నిమిత్తం బహ్రెయిన్ వెళ్లారు.

దుర్రత్ అల్ బహ్రెయిన్ సముద్ర తీరంలో గడుపుతున్న సమయంలో శ్రీనివాస్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు నిర్ధారించారు.

Read also: Indonesia, Australia, New Zealand: నేటి నుంచి ప్రధాని మోదీ ఆరు రోజుల విదేశీ పర్యటన

 Telangana native dies in Bahrain

ఏడేళ్లుగా బహ్రెయిన్‌లోనే పని

శ్రీనివాస్ ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్ళి చాలా కాలం అయ్యింది. అక్కడ ఉన్న మహమ్మద్ అహ్మద్ కో (MAC) సంస్థలో 2019 నుంచి పని చేస్తున్నారు. కుటుంబ పోషణ కోసం విదేశాలకు వెళ్లిన శ్రీనివాస్ ఇలా అకాల మరణం చెందడం కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది. తన స్వస్థలానికి పంపాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వం కోరుతున్నారు. శ్రీనివాస్ మరణ వార్త తెలియగానే నిజామాబాద్ జిల్లాలోని ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Telangana man dies in Bahrain:సహాయక చర్యలు, మృతదేహ తరలింపు

ప్రమాదం జరిగిన వెంటనే కోస్ట్ గార్డ్ బృందాలు మృతదేహాన్ని వెలికితీశారు. ఘటనపై బహ్రెయిన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారులు మృతుడి కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం అందించారు. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రవాస భారతీయులు శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

దలైలామాకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha