Dailyhunt
విశాఖలో బిసి డెడికేటెడ్ కమిషన్ పర్యటన

విశాఖలో బిసి డెడికేటెడ్ కమిషన్ పర్యటన

వార్త 1 week ago

BC Dedicated Commission: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లపై అధ్యయనం కోసం, సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ తొలిసారిగా విశాఖపట్టణం జిల్లాలో పర్యటించింది.

చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వం లోని అధికారులు గురువారం జిల్లాకు విచ్చేసి జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, అధికారులు, స్థానిక బిసి సంఘాల నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి నుంచి పలు అంశాలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజల నుండి సంఘాల ప్రతినిధుల నుంచి చైర్మన్ వినతులు స్వీకరించారు. వారు చెప్పిన సూచనలను వినడంతో పాటు నమోదు చేసుకున్నారు.

Read Also: Buddha Purnima 2026: ప్రజలకు బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్

BC Dedicated Commission: వివిధ కుల సంఘాల విన్నపాలు

పలు అంశాలను నివేదించిన బిసి సంఘాల ప్రతినిధులుబర్రాజు కులానికి చెందిన వారికి కూడా రాజకీయపరమైన అవకాశాలు కల్పించాలని ఆ సంఘ ప్రతినిధి ఎన్. రాజీవ్ కుమార్ కోరాడు. సామెతల ద్వారా తమని హేళన చేస్తున్నారని, దానికి నివారణ చర్యలు తీసుకోవటంతో పాటు తమని ఎస్సీ జాబితాలో చేర్చాలని నాయీ బ్రాహ్మణ ప్రతినిధి కోట సదేశ్ విజప్తి చేశారు. రాబోవు రోజుల్లో విశాఖపట్టణం కార్పొరేషన్ ఎన్నికల్లో కనీసం ఐదు వార్డుల్లో ప్రాతినిధ్యం కల్పించేలా అవకాశం కల్పించాలని కళింగ కార్పొరేషన్ ప్రతినిధి విన్నవించారు. అలాగే బిసిడిలో ఉన్న తమను బిసిఎ జాబితాలో చేర్చాలని, రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని నాగవంశం కార్పొరేషన్ చైర్మన్ వై. రామారావుతో పాటు, అదే కురానికి చెందిన కె. రామానాయుడు, గాడు చిన్నకుమారి లక్ష్మీ కోరారు.

దేవాలయాల్లో వాయిద్యం వాయించే విధంగా అవకాశం కల్పించాలని, మంగలి అని కాకుండా నాయీ బ్రాహ్మణిగా అందరూ పిలవాలని ఆ సంఘ ప్రతినిధి ముసిడిపల్లి రమణ విజ్ఞప్తి చేశారు. తమను బిసిబి నుంచి బిసిఎ జాబితాకు మార్చాలని విశ్వబ్రాహ్మణ సంఘ ప్రతినిధి బోడి నరసింహాచారి, రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కళింగ వైశ్య సంఘ ప్రతినిధి కోరాడ రాజారావు కమిషన్ విన్నవించారు. వీరితో పాటు ఇతర ప్రతినిధులు వారి అభిప్రాయాలను వెల్లడించారు.. పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డేటా మ్యాపింగ్ పక్కాగా ఉండాలి:

డేటా మ్యాపింగ్‌పై కమిషన్ ఆదేశాలు

పంచాయతీరాజ్, మున్సివల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో బిసి కులాలకు సంబంధించి సేకరించే డేటా మ్యాపింగ్ పక్కాగా జరగాలని, తారతమ్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బిసి డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆదేశించారు. వినతులు స్వీకరణ అనంతరం అధికారులతో మాట్లాడిన ఆయన పలు అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. సెన్సస్ ప్రక్రియలో కూడా బిసి కులాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించుకోవాలని సూచించారు.

స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల ద్వారా జరిగే సర్వే ప్రక్రియలను పూర్తిగా పరిశీలిస్తూ సంబంధిత సమాచా రాన్ని పంచాయతీ రాజ్, మున్సిపల్ కార్పొరేషన్ విభాగాలు సరిచూసుకోవాలని చెప్పారు. గత ఎన్నికల్లో బిసి కులం నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రతినిధుల వివరాలను సేకరించాలని సూచించారు. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్, విశాఖపట్టణం, అనకాపల్లి బిసి వెల్ఫేర్ అధికారులు రాజేశ్వరి, శ్రీదేవి, సిపిఒ శ్రీనివాసరావు, డిపిఒ శ్రీనివాసరావు, ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ట్యాంక్ సామర్థ్యం 27 లీటర్లు, బిల్లు మాత్రం 32 లీటర్లు! వింత మోసం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha