Vizag cyber fraud: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఒక షాకింగ్ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్లను వాడుకుంటూ సైబర్ నేరగాళ్లు ఈ ఘరానా మోసానికి తెరలేపారు.
AI సాంకేతికతను డీప్‌ఫేక్ ఉపయోగించి, వారు మాట్లాడుతున్నట్లే నకిలీ వీడియో కాల్స్ సృష్టించి ఒక అమాయక వ్యక్తిని బురిడీ కొట్టించారు.
Read Also : Accidents : వామ్మో ..గంటకు 20 మంది రోడ్డు ప్రమాదాలకు బలి
Cyber frauds in Visakhapatnam using the names of CM Chandrababu and Lokesh!
Vizag cyber fraud: భూ వివాదం పరిష్కరిస్తామని నమ్మబలికి వసూళ్లు
నగరంలోని సీతంపేట ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి కొంతకాలంగా ఒక భూ వివాదంతో ఇబ్బంది పడుతున్నాడు. దీనిని ఆసరాగా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు.. తాము ప్రభుత్వ పెద్దలమంటూ అతడిని సంప్రదించారు. సాంకేతికత సాయంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తరహాలోనే హావభావాలు ఉండేలా వీడియో కాల్స్ చేసి, సదరు భూ వివాదాన్ని తామే స్వయంగా పరిష్కరిస్తామని బాధితుడికి పక్కాగా నమ్మబలికారు. వారి మాటలను నిజమని నమ్మిన శ్రీనివాస్‌రెడ్డి, వారు అడిగినట్లుగా విడతల వారీగా దాదాపు రూ.80 వేల వరకు డబ్బులు చెల్లించాడు.
ఆలస్యంగా వెలుగుచూసిన మోసం
డబ్బులు తీసుకున్న తర్వాత కూడా పని కాకపోవడం, అవతలి వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో బాధితుడు తాను దారుణంగా మోసపోయానని గ్రహించాడు. ఏఐ టెక్నాలజీతో తనను నమ్మించి సైబర్ దొంగలు డబ్బులు గుంజారని తెలుసుకుని విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ హైటెక్ నేరానికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

