Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విశాఖలో స్వదేశీ నౌకకు శ్రీకారం.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేతుల మీదుగా ప్రారంభం

విశాఖలో స్వదేశీ నౌకకు శ్రీకారం.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేతుల మీదుగా ప్రారంభం

వార్త 2 weeks ago

Rajnath Singh: భారత రక్షణ రంగాన్ని స్వావలంబన దిశగా నడిపించడంలో విశాఖపట్నం మరో చారిత్రక ఘట్టానికి వేదికైంది. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL) ప్రాంగణంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ (FSS-1)ను అధికారికంగా జలప్రవేశం చేయించారు.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, రక్షణ ఉత్పత్తి శాఖ కార్యదర్శి సంజీవ్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.

కేవలం 18 నెలల్లోనే అద్భుత నిర్మాణం

భారత నావికాదళం కోసం హెచ్‌ఎస్‌ఎల్‌ సంస్థ మొత్తం ఐదు ఫ్లీట్ సపోర్ట్ నౌకలను తయారు చేస్తోంది. ఇందులో భాగంగా తొలి నౌకను కేవలం 18 నెలల రికార్డు సమయంలోనే స్టీల్ కటింగ్ దశ నుంచి నీటిలోకి ప్రవేశపెట్టడం గమనార్హం. సుమారు 43,500 టన్నుల బరువుండే ఈ నౌకల ద్వారా హిందూ మహాసముద్ర జలాల్లో తిరుగుతున్న యుద్ధనౌకలకు నడిసముద్రంలోనే ఇంధనం, ఆహారం మరియు అత్యవసర సామగ్రిని సులభంగా అందించవచ్చు. దీనివల్ల మన నేవీ ఆపరేషనల్ సామర్థ్యాలు మరింత పటిష్టం కానున్నాయి. ఇదే వేదికపై ఐదో నౌక (FSS-5) నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయడం విశేషం.

Rajnath Singh: హెచ్‌ఎస్‌ఎల్‌లో అత్యాధునిక మౌలిక వసతుల ప్రారంభం

ఈ పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్‌ఎస్‌ఎల్‌లో నూతనంగా ఆధునికీకరించిన స్లిప్‌వే-4తో పాటు, 300 టన్నుల భారీ బరువును మోయగల గోలియత్ క్రేన్‌ను ప్రారంభించారు. ఈ అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి రావడంతో, ఇకపై హెచ్‌ఎస్‌ఎల్‌లో దాదాపు 45,000 డీడబ్ల్యూటీ (Deadweight Tonnage) వరకు బరువున్న అతిపెద్ద నౌకలను సైతం సులభంగా నిర్మించే వీలు కలుగుతుంది.

ఒడిశాలో ఏరో-ఇంజిన్ రంగంలో చారిత్రక మైలురాయి

విశాఖ పర్యటన ముగిసిన అనంతరం రక్షణ మంత్రి ఒడిశాలోని కోరాపుట్‌లో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) కేంద్రాన్ని సందర్శించనున్నారు. అక్కడ హెచ్‌ఏఎల్ తయారు చేసిన 2,000వ ఏరో-ఇంజిన్‌ను అందించే అరుదైన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. గత ఆరు దశాబ్దాలుగా ఏరోస్పేస్ రంగానికి ఈ కేంద్రం అందిస్తున్న సేవలు అభినందనీయం. అంతేకాకుండా, రూ. 218 కోట్ల భారీ పెట్టుబడితో రూపుదిద్దుకుంటున్న ‘శక్తి’ ఇంజిన్ల రెండో ఉత్పత్తి విభాగాన్ని ఈ సందర్భంగా జాతికి అంకితం చేయనున్నారు. ఈ నూతన ప్లాంట్ ద్వారా ధ్రువ్, ప్రచండ్ వంటి స్వదేశీ హెలికాప్టర్ల అవసరాలు పూర్తిస్థాయిలో తీరనున్నాయి. విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించి, రక్షణ పరికరాలను మన దేశంలోనే స్వయంగా డిజైన్ చేసి తయారుచేసే స్థాయికి భారత్ చేరుకుంటోందనడానికి ఈ పరిణామాలు బలమైన నిదర్శనమని రక్షణ శాఖ వెల్లడించింది.

అంబటి రాంబాబుకు కిర్లంపూడి పోలీసుల నోటీసులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha