Dailyhunt
Vishapatnam: 12వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు హాజరైన మంత్రి లోకేష్

Vishapatnam: 12వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టుకు హాజరైన మంత్రి లోకేష్

వార్త 3 months ago

విశాఖపట్నం (Vishapatnam) 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. తనపై సాక్షి పత్రిక ప్రచురించిన అసత్య కథనంపై పరువునష్టం దావా వేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి జరుగుతున్న విచారణ లో భాగంగా ఆయన కోర్టుకు వచ్చారు.

నారా లోకేష్ దాఖలు చేసిన పరువునష్టం దావా 2019 అక్టోబర్ 22న సాక్షి పత్రికలో ప్రచురితమైన ఒక కథనానికి సంబంధించినది.

Read also:Andhra Pradesh: మిల్లర్లపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం

రెండు దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి

'చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి' అనే శీర్షికతో వచ్చిన ఈ కథనం పూర్తిగా అసత్యమని, తన ప్రతిష్టను భంగం కలిగించేలాగా, ప్రచురించారని లోకేష్ ఆరోపిస్తున్నారు. ప్రజల్లో తనపై తప్పు అభిప్రాయం కలిగేలా కావాలనే ఇలాంటి కథనాలు రాశారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.ఈ కేసులో ఇప్పటికే రెండు దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయ్యాయి. నేడు మూడోసారి క్రాస్ ఎగ్జామినేషన్‌కు సంబంధించి మంత్రి నారా లోకేష్ తన న్యాయవాదులతో కలిసి కోర్టుకు హాజరయ్యారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

AP Government: గర్భిణులకు రూ.6 వేల ఆర్థిక సహాయం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha