Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విశ్రాంత ఉద్యోగ నిధులపై సైబర్ నేరగాళ్ల కన్ను

విశ్రాంత ఉద్యోగ నిధులపై సైబర్ నేరగాళ్ల కన్ను

వార్త 2 weeks ago

Cyber Crime : అధిక లాభాలు ఆశ చూపి విశ్రాంత ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్ పెట్టుబడుల పేరుతో లోయ ప్రకాశరావు అనే 71 ఏళ్ల విశ్రాంత రైల్వే ఉద్యోగి నుంచి రూ.

23 లక్షలకు పైగా నొక్కేసిన బెంగళూరుకు చెందిన గౌతమ్, మంజునాథ్‌లను సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. విశ్రాంత ఉద్యోగి 2022లో ఆన్‌లైన్‌లో మ్యూచువల్ ఫండ్స్ గురించి శోధించిన సమయంలో నిందితులకు అతని వివరాలు చిక్కాయి. గతంలో ట్రేడింగ్ సంస్థల్లో పనిచేసిన అనుభవంతో వీరు ప్రకాశరావుకు నకిలీ పేర్లతో ఫోన్ చేశారు.పాత లాభాలు వెనక్కి రావాలంటే రకరకాల రుసుములు చెల్లించాలని బెదిరించి నాలుగున్నరేళ్లపాటు డబ్బులు వసూలు చేశారు.బాధితుడు మోసాన్ని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిఘా ప్రారంభమైంది.నిందితులు బాధితుడితో మాట్లాడేందుకు మాత్రమే వినియోగించిన ఒకే ఒక ప్రత్యేక సెల్ ఫోన్ నంబర్ (CDR రిపోర్టు) ఆధారంగా పోలీసులు అసలు గుట్టును రట్టు చేశారు.

Read Also: Disha Salian Case: దిశా సాలియాన్ మృతి కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు

 Cyber Crime

Cyber Crime : మ్యూల్ (అద్దె) ఖాతాల వినియోగం

సీపీ ఎస్.వి. రాజశేఖరబాబు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు బెంగళూరు, అనంతపురంలో విచారణ జరిపాయి. నిందితులు ఇతరుల బ్యాంకు ఖాతాలను అద్దెకు (Mule Accounts) తీసుకుని బాధితుడి నుంచి నగదు బదిలీ చేయించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఖాతాల లావాదేవీల ఆధారంగా అసలు నిందితులైన గౌతమ్, మంజునాథ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశరావు తాను రూ. 20 లక్షలు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు చేయగా, విచారణలో మొత్తం రూ. 23 లక్షల వరకు దోపిడీ జరిగినట్లు తేలింది. పోలీసులు నిందితుల నుంచి రూ. 7.5 లక్షల నగదును సీజ్ చేయగా, మిగిలిన రూ. 15 లక్షలను తిరిగి చెల్లించేందుకు నిందితులు అంగీకరించారు.

Epaper: epaper.vaartha.com

నకిలీ వైద్యుల గుట్టు రట్టు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha