Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విశ్వంభర'లో అవనిగా త్రిష.. మెగాస్టార్ సినిమా నుంచి బర్త్ డే సర్ప్రైజ్!

విశ్వంభర'లో అవనిగా త్రిష.. మెగాస్టార్ సినిమా నుంచి బర్త్ డే సర్ప్రైజ్!

వార్త 1 month ago

Trisha Birthday Special: మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'విశ్వంభర' అంచనాలను పెంచుతూ సరికొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. ఈ భారీ బడ్జెట్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌లో నటి త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

నేడు ఆమె పుట్టినరోజు కావడంతో, చిత్ర బృందం ఆమెకు విషెస్ చెబుతూ సినిమాలో ఆమె పాత్రను పరిచయం చేసింది.

Read Also :Peddi Movie Trailer: 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్?

అవనిగా త్రిష 'విశ్వరూపం'

ఈ సినిమాలో త్రిష ‘అవని’ అనే అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రను పోషిస్తోంది. విడుదల చేసిన పోస్టర్‌లో త్రిష లుక్ ఎంతో ఆకర్షణీయంగా, గౌరవప్రదంగా ఉంది. ఆమె తన సహజ సిద్ధమైన నటనతో మరియు వ్యక్తిత్వంతో ‘అవని’ పాత్రకు నిండుతనాన్ని, ప్రాణాన్ని పోసిందని మేకర్స్ ప్రశంసించారు. ఆమె పాత్ర సినిమాలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడమే కాకుండా కథలో కీలక మలుపులకు కారణమవుతుందని సమాచారం.

Trisha Birthday Special: విజువల్ వండర్‌గా ‘బియాండ్ ది యూనివర్స్’

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం ‘బియాండ్ ది యూనివర్స్’ అనే క్యాప్షన్‌తో ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతోంది. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చిరంజీవి, త్రిష కాంబినేషన్‌ను వెండితెరపై చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆస్కార్ గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

పుట్టినరోజున తిరుమలలో త్రిష.. విజయ్ పార్టీ విజయం కోసమేనా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha