Queen 2 : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన 'క్వీన్' (2014) చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'క్వీన్-2' సినిమా విడుదలకు ముందే భారీ చట్టపరమైన ఇబ్బందుల్లో పడింది.
తమ అనుమతి లేకుండా, హక్కులను ఉల్లంఘిస్తూ ఈ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ ఫాంటమ్ స్టూడియోస్ ‘జియోస్టార్’ (JioStar) నెట్‌వర్క్‌పై బాంబే హైకోర్టులో ఏకంగా రూ.250 కోట్లకు భారీ నష్టపరిహారం దావా వేసింది. ఒరిజినల్ వెర్షన్ అయిన ‘క్వీన్’ చిత్రంపై తమకు 50 శాతం వాటా హక్కులతో పాటు, దానికి సంబంధించిన సీక్వెల్ లేదా రీమేక్ హక్కులు కూడా పూర్తిగా తమ వద్దే ఉన్నాయని ఫాంటమ్ స్టూడియోస్ కోర్టుకు తెలిపింది. తమ హక్కులను కాదని జియోస్టార్ ఏకపక్షంగా ముందుకెళ్లడం చట్టవిరుద్ధమని వారు వాదిస్తున్నారు.

పలుమార్లు చర్చలు జరిపినా దక్కని ఫలితం.. కోర్టు తీర్పుపైనే సీక్వెల్ భవితవ్యం
ఈ వివాదాన్ని కోర్టు వెలుపల సర్దుబాటు చేసుకునేందుకు ఫాంటమ్ స్టూడియోస్ యాజమాన్యం గతంలో పలుమార్లు జియోస్టార్ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించింది. అయితే ఆ చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, చివరకు న్యాయపోరాటానికి దిగక తప్పలేదని స్పష్టం చేసింది. 2014లో వికాస్ బాల్ దర్శకత్వంలో వచ్చిన ‘క్వీన్’ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించడమే కాకుండా, కంగనా రనౌత్‌కు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అంతటి ప్రతిష్టాత్మక చిత్రానికి సీక్వెల్ కావడంతో ఈ వివాదం ఇప్పుడు బాలీవుడ్ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రూ.250 కోట్ల భారీ దావాపై బాంబే హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపైనే ఇప్పుడు ‘క్వీన్-2’ సినిమా భవితవ్యం ఆధారపడి ఉంది.
సెన్సార్ రిపోర్ట్‌పై సోషల్ మీడియాలో ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన 'జన నాయగన్' టీమ్

