Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వివాహేతర సంబంధంపై మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వివాహేతర సంబంధంపై మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Madras High Court: భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన, దాన్ని భార్య పట్ల క్రూరత్వంగా పరిగణించలేమని మద్రాస్‌ హైకోర్టు స్పష్టం చేసింది.

భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్‌ 498A కింద నేరం నిరూపించాలంటే, వివాహేతర సంబంధానికి మించి క్రూరత్వానికి సంబంధించిన ఆధారాలు ఉండాలని పేర్కొంది. భార్య, చిన్నారి మృతి చెందిన కేసులో భర్తను నిర్దోషిగా ప్రకటిస్తూ ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.

Read Also :Tamil Nadu ATF VAT Cut: విమాన ఇంధనంపై వ్యాట్‌ తగ్గింపు.. సీఎం విజయ్‌

2010లో భార్య, చిన్నారి ఆత్మహత్య

2008లో వివాహం చేసుకున్న దంపతులకు ఒక బిడ్డ ఉన్నాడు. అయితే 2010లో భార్య తన ఏడాదిన్నర వయసున్న బిడ్డతో కలిసి నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త వరకట్నం కోసం వేధించాడని, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను, బిడ్డను నిర్లక్ష్యం చేశాడని ఆమె గతంలో ఆరోపించినట్లు కేసు వివరాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు భర్తపై ఐపీసీ సెక్షన్‌ 498A కింద క్రూరత్వం, సెక్షన్‌ 306 కింద ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి అభియోగాలతో కేసు నమోదు చేశారు.

భర్తను నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్‌ కోర్టు

ఈ కేసును విచారించిన తిరుప్పూర్‌ ఫాస్ట్‌ ట్రాక్‌ మహిళా కోర్టు, వరకట్న వేధింపులకు సంబంధించిన ఆరోపణలు నిరూపితం కాలేదని పేర్కొంటూ 2018లో భర్తను నిర్దోషిగా ప్రకటించింది. ప్రభుత్వం ఆ తీర్పుపై అప్పీల్‌ దాఖలు చేయకపోవడంతో, మరణించిన మహిళ సోదరుడు టి. దైవకుమార్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీల్‌పై జస్టిస్‌ సుందర్‌ మోహన్‌ విచారణ చేపట్టారు. భర్తకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, ఆ ఒక్క అంశం ఆధారంగా భార్య ఆత్మహత్యకు ప్రేరేపించేంత క్రూరత్వం జరిగిందని నిర్ధారించలేమని కోర్టు అభిప్రాయపడింది. ఐపీసీ సెక్షన్‌ 498A కింద నేరం నిరూపించాలంటే, చట్టంలో పేర్కొన్న క్రూరత్వానికి సంబంధించిన అదనపు ఆధారాలు అవసరమని స్పష్టం చేసింది. ఈ కేసులో అటువంటి ఆధారాలు లేవని పేర్కొంది.

Madras High Court: సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించిన హైకోర్టు

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గతంలో పినాకిన్‌ మహిపత్రాయ్‌ రావల్‌ వర్సెస్‌ గుజరాత్‌ రాష్ట్రం కేసులో ఇచ్చిన తీర్పును హైకోర్టు ప్రస్తావించింది. వరకట్న వేధింపుల ఆరోపణలు కూడా అస్పష్టంగా ఉన్నాయని, ప్రాథమిక ఫిర్యాదులో వాటి ప్రస్తావన లేదని పేర్కొంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం అప్పీల్‌ను కొట్టివేసి, ట్రయల్‌ కోర్టు ఇచ్చిన నిర్దోషిత్వ తీర్పును సమర్థించింది.

జామియా మిలియా ఇస్లామియా విద్యార్థుల నిరసనలతో ఆన్‌లైన్‌ క్లాసులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha