Vietnam Boat Accident: వియత్నాం దేశంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడ జరిగిన ఒక భయంకరమైన పడవ ప్రమాదంలో 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
మరణించిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు లేదా నివాసితులు కూడా ఉన్నారని ప్రాథమిక సమాచారం అందడంతో తెలుగు రాష్ట్రంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘోర దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించి, రంగంలోకి దిగింది.

రంగంలోకి దిగిన మంత్రి నారా లోకేశ్
ఈ హృదయ విదారక ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తక్షణమే స్పందించారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయ (ఇండియన్ ఎంబసీ) అధికారులతో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడారు. ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుత అక్కడ సహాయక చర్యల పరిస్థితి ఏమిటి? అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థలంలో ఉన్న బాధితులకు తక్షణమే అవసరమైన అన్ని రకాల అత్యవసర సహాయ సహకారాలు అందించాలని ఆయన ఎంబసీ అధికారులను కోరారు.
Vietnam Boat Accident: బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రమాదానికి గురైన తెలుగువారి కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం తరఫున మంత్రి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఏపీ భవన్ అధికారులకు కీలక ఆదేశాలు
ఈ ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. మృతుల వివరాలను సేకరించి, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారాన్ని, సహాయాన్ని త్వరితగతిన అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.
అక్రమ చేపల వేటపై ఏపీ సర్కార్ సీరియస్.. సీజ్ చేసిన బోట్లు వదిలేదే లేదు కలెక్టర్

