Vietnam Boat Accident: వియత్నాం దేశంలో భారతీయ పర్యాటకులకు సంబంధించిన ఒక అత్యంత ఘోరమైన పడవ ప్రమాదం చోటుచేసుకుంది. భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఒక లగ్జరీ స్పీడ్ బోట్ సముద్రంలో ఒక్కసారిగా బోల్తా పడి మునిగిపోయింది.
వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ‘ఫు క్వాక్’ ద్వీపం సమీపంలో శనివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం 15 మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. సముద్రంలో ఒక్కసారిగా మారిన ప్రతికూల వాతావరణ పరిస్థితులే ఈ భారీ ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం అందుతోంది.
ఓషన్ పెరల్ ఐలాండ్ కంపెనీకి చెందిన ‘ఏజీ-26751’ అనే పర్యాటక స్పీడ్ బోటులో భారత పర్యాటకులు, సిబ్బందితో కలిసి సముద్ర విహారయాత్రకు వెళ్లారు. ఫు క్వాక్ దీవి సమీపంలోని హోన్ మే రుట్ న్గోయి ప్రాంతంలో పడవ ప్రయాణిస్తున్న సమయంలో.. ఒక్కసారిగా బలమైన గాలులు వీయడంతో పాటు అలల ఉద్ధృతి విపరీతంగా పెరిగింది. దీంతో ఆ వేగానికి పడవ అదుపుతప్పి సముద్రంలో తలకిందులైంది. వెంటనే వియత్నాం కోస్ట్ గార్డ్ , స్థానిక సహాయక బృందాలు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు సముద్రంలో మునిగిపోతున్న సుమారు 21 మందిని రక్షించగా, వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఇంకా కొంతమంది సముద్రంలో గల్లంతవడంతో వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
Read Also : Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన
Speedboat capsizes in Vietnam; 15 Indian tourists dead!
Vietnam Boat Accident: ఒకే మొబైల్ కంపెనీకి చెందిన డిస్ట్రిబ్యూటర్లు.. మృతుల్లో ఏపీ, తెలంగాణ వారు!
ఈ విహారయాత్రకు సంబంధించిన వివరాలు చూస్తే తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. ఒక ప్రముఖ మొబైల్ కంపెనీ తరఫున దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 250 మంది డిస్ట్రిబ్యూటర్లు బిజినెస్ ట్రిప్‌లో భాగంగా వియత్నాం పర్యటనకు వెళ్లారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 35 మంది, తెలంగాణకు చెందిన వారు 40 మంది ఉన్నారు. మొత్తం ఐదు వేర్వేరు బోట్లలో పర్యాటకులు విహారానికి వెళ్లగా, అందులో ఒక బోటు మాత్రమే ఈ ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం.. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గిల్లి కిశోర్ భార్య జయశ్రీ, అలాగే కడప జిల్లాకు చెందిన ముడియం శ్రీధర్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గిల్లి కిశోర్ పరిస్థితి కూడా ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా, కడపకు చెందిన నయీమ్ అనే మరో డిస్ట్రిబ్యూటర్ చివరి నిమిషంలో ఆ ప్రమాదకర బోటు ఎక్కకపోవడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
రంగంలోకి భారత రాయబార కార్యాలయం.. ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు
ఈ ఘోర విషాద ఘటనపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) తక్షణమే స్పందించింది. ప్రమాదాన్ని అధికారికంగా ధ్రువీకరిస్తూ ఒక అత్యవసర ప్రకటన విడుదల చేసింది. బాధితులను రక్షించేందుకు వియత్నాం ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. బాధితుల కుటుంబ సభ్యులకు తాజా సమాచారం అందించేందుకు, వారిని సమన్వయం చేసేందుకు హో చి మిన్ సిటీ, హనోయ్‌లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం ఈ క్రింది ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. +84 36 281 7930, +84 91 552 37 14, +84 33 452 0414, +84 91 308 9165 తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి కుటుంబ సభ్యులు ఈ నంబర్ల ద్వారా సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని రాయబార కార్యాలయం సూచించింది.
Vietnam Boat Accident:

