Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వ్లాగ్స్‌పై పంజాబ్ కింగ్స్ నిషేధం.. అర్ష్‌దీప్‌కు తప్పని తిప్పలు!

వ్లాగ్స్‌పై పంజాబ్ కింగ్స్ నిషేధం.. అర్ష్‌దీప్‌కు తప్పని తిప్పలు!

వార్త 2 weeks ago

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస వివాదాలు బీసీసీఐని, ఫ్రాంచైజీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆటగాళ్లు సోషల్ మీడియాలో వ్యక్తిగత వ్లాగ్స్ (Vlogs) పోస్ట్ చేయడంపై పంజాబ్ కింగ్స్ యాజమాన్యం సీరియస్ అయ్యింది.

జట్టు అంతర్గత వ్యూహాలు, డ్రెస్సింగ్ రూమ్ చర్చలు బయటకు రాకుండా ఉండేందుకు స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై కీలక ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న అర్ష్‌దీప్, తరచుగా మైదానంలోని దృశ్యాలను షేర్ చేస్తుంటారు, ఇది జట్టు భద్రతకు ముప్పుగా యాజమాన్యం భావిస్తోంది.

Read Also:RR vs GT Match : గిల్ తుఫాన్ ఇన్నింగ్స్.. 230 పరుగుల లక్ష్యంతో గుజరాత్

IPL 2026: ధర్మశాలలో అత్యవసర సమావేశం

ధర్మశాల స్టేడియంలో ప్రాక్టీస్ ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఆటగాళ్లతో భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్త నిబంధనలను వివరించి, ప్రతి ఆటగాడి నుంచి రాతపూర్వక అంగీకారాన్ని తీసుకోనున్నారు. ఇకపై జట్టుకు సంబంధించిన ఎలాంటి కంటెంట్ అయినా కేవలం పంజాబ్ కింగ్స్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారానే విడుదల కావాలని, వ్యక్తిగత ఖాతాల్లో పోస్ట్ చేయకూడదని స్పష్టం చేయనున్నారు.

బీసీసీఐ కొత్త మార్గదర్శకాలు: వేపింగ్, భద్రతపై నజర్

ఈ సీజన్‌లో కొందరు ఆటగాళ్లు నిషేధిత ప్రాంతాల్లో పొగత్రాగడం (Vaping) వంటి చర్యలకు పాల్పడటంతో బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఆటగాళ్ల రక్షణ కోసం మరికొన్ని నిబంధనలను చేర్చిన విషయం తెలిసిందే.

 IPL2026, Arshdeep Singh

ఆటగాళ్లు హోటల్ వదిలి వెళ్లే ముందు అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

జట్టు మేనేజర్, భద్రతా అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లకూడదు.

తెలియని వ్యక్తులు ఆటగాళ్ల గదుల్లోకి ప్రవేశించకుండా కఠినమైన నిఘా ఉంచాలి.

హనీట్రాప్, బెట్టింగ్ వంటి ముప్పుల నుంచి ఆటగాళ్లను రక్షించడమే ఈ నియమాల ప్రధాన ఉద్దేశ్యం.

క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని బీసీసీఐ హెచ్చరించింది. నిబంధనలు ఖాతరు చేయని ఆటగాళ్లు లేదా ఫ్రాంచైజీలపై భారీ జరిమానాలు విధించనున్నారు. ఉల్లంఘన తీవ్రతను బట్టి ప్రస్తుత సీజన్ లేదా భవిష్యత్తు సీజన్ల నుండి సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ చట్టపరమైన సమస్యలు తలెత్తితే నేరుగా పోలీసులకు అప్పగిస్తామని బోర్డు స్పష్టం చేసింది. పంజాబ్ కింగ్స్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఐపీఎల్‌లో కొత్త ఒరవడికి నాంది కానుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గిల్ హాఫ్ సెంచరీ.. గుజరాత్‌కు శుభారంభం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha