CM Vijay : తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్‌కు సంబంధించిన ఓ మానవీయ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించిన సీఎం విజయ్..
ఆమెకు స్వయంగా కళ్లద్దాలు పెట్టిన దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. (CM Vijay) ముఖ్యమంత్రిని కలిసిన ఆనందంలో ఆ వృద్ధురాలు ఆయన చేతిని పట్టుకుని భావోద్వేగానికి గురైనట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను పలు తమిళ మీడియా సంస్థలు సోషల్ మీడియాలో పంచుకున్నాయి.
కళ్లద్దాలు పెట్టుకున్న తర్వాత వృద్ధురాలు సంతోషం :
వీడియోలో కనిపిస్తున్న వివరాల ప్రకారం.. విజయ్ ఆ వృద్ధురాలితో కొద్దిసేపు మాట్లాడి, ఆమెకు కళ్లద్దాలు అందించారు. అనంతరం వాటిని స్వయంగా ఆమెకు పెట్టారు. కళ్లద్దాలు పెట్టుకున్న తర్వాత వృద్ధురాలు సంతోషం వ్యక్తం చేస్తూ విజయ్ చేతిని పట్టుకున్న దృశ్యం ప్రత్యేకంగా వైరల్ అవుతోంది. సాధారణంగా రాజకీయ నాయకులను కలిసే సమయంలో భద్రతా సిబ్బంది, అధికారిక కార్యక్రమాల హడావుడి కనిపిస్తుంటుంది. కానీ ఈ సందర్భంలో విజయ్ వృద్ధురాలితో ఎంతో సన్నిహితంగా, ఆప్యాయంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.
CM Vijayఈ ఘటనపై విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. 'ప్రజలతో మమేకమయ్యే నాయకుడు' అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. వృద్ధురాలి ఆనందాన్ని చూసి విజయ్ కూడా చిరునవ్వుతో స్పందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్.. పాలనలోనూ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అయితే ఈ కళ్లద్దాల ఘటనకు సంబంధించిన పూర్తి నేపథ్యం, కార్యక్రమం జరిగిన ప్రదేశం, వృద్ధురాలికి కళ్లద్దాలు అందించే కార్యక్రమం ఏదన్న విషయంపై అధికారికంగా మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం విజయ్ చూపించిన ఆప్యాయతకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

