Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వృద్ధురాలిని ఆప్యాయంగా హత్తుకున్న సీఎం విజయ్

వృద్ధురాలిని ఆప్యాయంగా హత్తుకున్న సీఎం విజయ్

వార్త 2 weeks ago

Tamilanadu : తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సేలం జిల్లాలోని మేట్టూరు డ్యామ్ నుండి కావేరీ డెల్టా వ్యవసాయ సాగు నీటిని విడుదల చేసే కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా సాంప్రదాయ పట్టు పంచె, తెల్ల చొక్కా ధరించి సాధారణ ప్రజలలో ఒకరిగా కనిపించిన ఆయన శైలి అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమం ముగిసిన అనంతరం అక్కడకు వచ్చిన ఒక రైతు కుటుంబాన్ని ఆయన ప్రత్యేకంగా పలకరించి, వారికి నూతన వస్త్రాలను బహూకరించారు. ఈ క్రమంలోనే ఆ కుటుంబంలోని వృద్ధురాలిపై తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు.

ముసలావిడతో కలిసి సీఎం సందడి

అక్కడ ఉన్న సదరు వృద్ధురాలిని సీఎం విజయ్ అత్యంత ఆప్యాయంగా హత్తుకోవడమే కాకుండా, స్వయంగా ఆమెకు కూలింగ్ గ్లాసెస్ పెట్టి మురిసిపోయారు. అనంతరం ఆ ముసలావిడ చేయి పట్టుకుని అక్కడి పరిసర ప్రాంతాల్లో కలయదిరుగుతూ, ఆమెతో కలిసి సభకు వచ్చిన ప్రజలందరికీ నవ్వుతూ అభివాదం చేశారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఎలాంటి హంగులు లేకుండా సామాన్యులతో ఇలా కలిసిపోవడం చూసి స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది.

గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీకి మరో అవకాశం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha